అక్షరటుడే, ఇందూరు: Government jobs | కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం (government job) రావడమే ఈరోజుల్లో కష్టం. అలాంటిది నగరంలోని మల్లెగోడ కుటుంబంలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. నగరంలోని అర్సపల్లికి చెందిన మల్లెగోడ సాయిలు ప్రభుత్వం ఉద్యోగి (government employees) కాగా.. ఆయన స్ఫూర్తితో ముగ్గురు కుమారులు, కూతురు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన మూడో కుమారుడు శ్రావణ్‌కు ఇటీవల గ్రూప్–3లో ఉద్యోగం రావడంతో వాళ్లింట్లో అందరూ సర్కారు ఉద్యోగాలు సాధించినట్లయ్యింది.
నగరంలోని అర్సపల్లి ప్రాంతానికి చెందిన మల్లెగోడ సాయిలు వాటర్ లైన్మెన్గా పనిచేసి దివంగతులయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు మల్లెగోడ గంగాధర్, గంగాప్రసాద్, శ్రావణ్, కుమార్తె గంగాభవాని ఉన్నారు. అయితే మొదటి కుమారుడైన మల్లెగోడ గంగాధర్ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదివారు. 2011లో ట్రాన్స్‌కోలో జూనియర్ లైన్‌మన్‌గా ఉద్యోగం సాధించాడు. 2016లో ఆయన జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇంట్లో తమ తండ్రి, అన్న సర్కారులు కొలువులు సాధించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకున్న మిగితా ముగ్గురు సైతం కష్టపడి చదువుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగాల కోసం అహోరాత్రులు కృషి చేశారు.
Government jobs | రాష్ట్రపతి నుంచి గోల్డ్‌మెడల్ అందుకుని..
మల్లెగోడ సాయిలు రెండో కుమారుడు గంగాప్రసాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (Central University) ఎంఏ పీహెచ్డీ చేశారు. రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తూ కష్టపడి ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ఈ క్రమంలో 2024లో డిగ్రీ లెక్చరర్ గురుకుల నోటిఫికేషన్లో ప్రభుత్వం లెక్చరర్‌గా (government lecturer) ఉద్యోగం సాధించారు.
Government jobs | గ్రూప్స్‌లో ఉద్యోగం కోసం..
ఇక మూడో కుమారుడు శ్రావణ్ అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్, జీజీ కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం తన సోదరుల స్ఫూర్తితో ఎలాగైనా సర్కారు కొలువు సాధించాలనే ఉద్దేశంతో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్–3లో హోమ్ పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్‌క్వార్టర్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు.
Government jobs | డిగ్రీలో ఉండగానే వీఆర్ఏగా ఉద్యోగం..
ఇక సాయిలు కుమార్తె గంగాభవానీ చదువులో చురుకుగా ఉండేవారు. 2012లో డిగ్రీ చదువుతూ ఉండగానే ఆమె వీఆర్ఏగా ఎంపికయ్యారు. అనంతరం 2023లో మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం మోపాల్ మండలంలో జీపీవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా మల్లెగోడ సాయిలు ఇళ్లంతా సర్కారు కొలువులతోనే నిండిపోయింది. వీరంతా నేటి యూవతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.