అక్షరటుడే, ఆర్మూర్ : Sub Collector Armoor | పోచంపేట్ గ్రామంలో (Pochampet Village) బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మరణంపై సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్యూ-పీవోడబ్ల్యూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు (Sub-Collector Abhijyan Malviya) సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
Sub Collector Armoor | అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోలేదు..
ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎం సత్తెక్క, పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు నిఖిల్ మాట్లాడుతూ.. విద్యార్థి సాయిలిఖిత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా అక్కడ సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఏఎన్ఎం, ఇన్ఛార్జి ప్రిన్సిపల్, సిబ్బంది ఆ విద్యార్థిని పట్టించుకోకపోవడం వల్లే సాయిలిఖిత మృతి చెందిందన్నారు. విద్యార్థిని మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Sub Collector Armoor | రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి..
అదే విధంగా విద్యార్థిని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం (Government Job) ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా కోశాధికారి అరవింద్, పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా ప్రధాన కార్యదర్శి రాజు, టీయూసీఏ ఆర్మూర్ ఏరియా నాయకులు నజీర్, పీడీఎస్యూ నాయకులు వివేక్, వెంకట్, సౌమిత్ తదితరులు పాల్గొన్నారు.