Homeజిల్లాలునిజామాబాద్​Mlc Kavitha | వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతిపై విచారణ జరిపించాలి

Mlc Kavitha | వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతిపై విచారణ జరిపించాలి

- Advertisement -

అక్షరటుడే ఇందల్వాయి: Mlc Kavitha | వేములవాడ రాజన్న ఆలయంలో కోడెల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్​ చేశారు. ఇందల్వాయిలో గ్రామంలో ప్రసిద్ధి చెందిన రామాలయాన్ని ఆమె సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి మరిన్ని నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్​ఎస్​ హయాంలో సైతం రామాలయ ప్రహరీకి నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. ఆలయాల అభివృద్ధికి కేసీఆర్​ రూ. కోట్లల్లో నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఆలయాలు కళ తప్పుతున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. మహిళలకు రూ. 2,500 ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కల్యాణలక్ష్మిలో భాగంగా వెంటనే తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మహిళలతో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్​ నాయక్​, సుధాకర్​, కుమార్​, బీఆర్​ఎస్​ నాయకులు తదితరులు పాల్గొన్నారు.