అక్షరటుడే, కామారెడ్డి: Engineering College | ఉమ్మడి జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని డాక్టరేట్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి సీతక్కను (Minister Seetakka) కోరారు. ఈ మేరకు మంగళవారం దోమకొండకు వచ్చిన మంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు డా.సంతోష్ గౌడ్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలిపోతుందన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి (PCC Chief) హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) కూడా తెలంగాణ విశ్వ విద్యాలయంలో (Telangana University) ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. ఇదే విషయమై ప్రభుత్వ పెద్దల ఆదేశానుసారం ఉన్నత విద్యా మండలి కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేసినప్పటికీ తాత్సరమవుతోందన్నారు.
కేబినెట్ సమావేశం సోమవారం జరుగగా జిల్లాకు ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తారని జిల్లా ప్రజలు, విద్యార్థులు ఆశగా ఎదురుచూశామని అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్‌గౌడ్ వాపోయారు. ఇప్పటికైనా కళాశాల కోసం అడుగుగు ముందుకు పడితే సంతోషిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్స్ అసోసియేషన్ సభ్యులు సరిత, రాహుల్, రమాదేవి, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.