అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Markets in Red | బడ్జెట్ ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. శుక్రవారం ఉదయం సెన్సెక్స్ 619 పాయింట్ల భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమై మరో 6 పాయింట్లు కోల్పోయింది.
నిఫ్టీ 171 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 29 పాయింట్లు పడిపోయింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే బాగుండడం ఇన్వెస్టర్లలలో నమ్మకాన్ని పెంచింది. దీంతో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం ప్రారంభ నష్టాలు తగ్గాయి. చివరికి సెన్సెక్స్ 296 పాయింట్ల నష్టంతో 82,269 వద్ద, నిఫ్టీ (Nifty) 98 పాయింట్ల నష్టంతో 25,320 వద్ద స్థిరపడ్డాయి.
మెటల్ సెక్టార్లో సెల్లాఫ్..
టెలికాం, ఆటో, కన్జూమర్ డ్యూరెబుల్, ఎఫఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, ఫార్మా రంగాల షేర్లు రాణించగా.. మెటల్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీ, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫైౖనాన్షియల్ సర్వీసెస్ రంగాల షేర్లు సెల్లాఫ్‌కు గురయ్యాయి. మెటల్ ఇండెక్స్ 5.12 శాతం పడిపోయింది. హిదుస్థాన్ జింక్ 12.12 శాతం, వేదాంత 10.89 శాతం, నేషనల్ అల్యూమినియం 10.32 శాతం నష్టపోయాయి.
అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎసఈలో నమోదైన కంపెనీలలో 2,424 కంపెనీలు లాభపడగా 1,783 స్టాక్స్ నష్టపోయాయి. 160 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 78 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 291 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 12 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Top Gainers : బీఎసఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభపడగా.. 17 కంపెనీలు నష్టపోయాయి. ఎంఅండఎం 1.33 శాతం, ఎస్బీఐ 1.27 శాతం, ఐటీసీ 1.11 శాతం, బీఈఎల్ 1.01 శాతం, టైటాన్ 0.83 శాతం లాభపడ్డాయి.
Top Losers : టాటా స్టీల్ 4.57 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 2.10 శాతం, పవర్‌గ్రిడ్ 1.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.60 శాతం, టెక్ మహీంద్రా 1.29 శాతం నష్టపోయాయి.