అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సుక్మా జిల్లా గొల్లపల్లిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా (Sukma District)లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. జిల్లా రిజర్వ్ గార్డ్ బృందం గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కొండపై గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గురువారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నట్లు సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ (Sukma SP Kiran Chavan) తెలిపారు. ఎన్కౌంటర్లో ఒక మహిళ మావోయిస్ట్ సహా ముగ్గురు చనిపోయారు. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.
Chhattisgarh Encounter | 284 మంది మృతి
తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 284 మంది నక్సలైట్లు మరణించారు. వారిలో సుక్మా, బీజాపూర్, దంతెవాడతో సహా ఏడు జిల్లాలను కలిగి ఉన్న బస్తర్ డివిజన్లో 255 మంది హతమయ్యారు, రాయ్‌పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే గరియాబంద్ జిల్లాలో మరో 27 మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. దుర్గ్ డివిజన్లోని మోహ్లా-మాన్పూర్-అంబాగఢ్ చౌకీ జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.
Chhattisgarh Encounter | ఆపరేషన్ కగార్తో..
కేంద్ర ప్రభుత్వం (Central Government) దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా పని చేస్తుంది. ఈ మేరకు ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టింది. వేల సంఖ్యలో బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో ఎన్కౌంటర్లలో వందలాది మంది చనిపోతుండటంతో మావోయిస్టు పార్టీ బలహీనంగా మారింది. కీలక నేతలు సహా అనేక మంది ఆయుధాలు వీడి లొంగిపోతున్నారు. జనవరి 1న తాము అందరం ఆయుధాలు వీడి సరెండర్ అవుతామని ఇప్పటికే ఛత్తీస్గడ్– మధ్యప్రదేశ్– మహారాష్ట్ర కమిటీ ప్రకటించింది. దీంతో త్వరలోనే దేశంలో మావోయిస్టు పార్టీ అంతం అయ్యే అవకాశం ఉంది.