40
అక్షరటుడే, వెబ్డెస్క్: Mexico earthquake | దక్షిణ మెక్సికోలో శుక్రవారం (జనవరి 2) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు మెక్సికో భూకంప కేంద్రం వెల్లడించింది. భూకంపం ధాటికి మెక్సికో Mexico సిటీ కంపించిపోయింది. దీని తీవ్రత దక్షిణ, మధ్య ప్రాంతాలపై కూడా పడింది.
Mexico earthquake | 35 కిలోమీటర్ల లోతులో..
భూకంపం ధాటికి భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. దక్షిణ ప్రాంతంలోని గెర్రెరోలోని సాన్ మార్కోస్ సమీపంలో.. పసిఫిక్ మహా సముద్రం తీర ప్రాంతమైన అకాపుల్కోకు దగ్గరలో భూమి లోపల సుమారు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.