అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR on Rythu Bharosa | రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. గురువారం ఆయన సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల (Municipal Election) ప్రచారం నిర్వహించారు.
కేటీఆర్ స్థానిక ప్రజలతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రైతుభరోసా వేస్తానని చెబుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి? ఎన్నిసార్లు రైతుబంధు వేశారో చెప్పాలన్నారు. రైతుభరోసా వేయడానికి మున్సిపల్ ఎన్నికలు ఎలా అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయేంత వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారని విమర్శించారు.
KTR on Rythu Bharosa | హామీలు ఇచ్చి మోసం
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. మరోసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మితే ప్రజలను మోసం చేయడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టాల్సిన అవసరం ఏముందన్నారు. చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.