అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | సింగరేణి స్కాంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ కుంభకోణం నుంచి సీఎం రేవంత్‌రెడ్డిని కాపాడేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) యత్నిస్తున్నారని ఆరోపించారు.
నైనీ కోల్ మైన్స్ ఆరోపణలు, సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై శనివారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ విధానం గతంలోనే ఉందని ఆయన పేర్కొన్నారు. భట్టికి కౌంటర్‌గా ఆదివారం హరీశ్‌రావు (Harish Rao) తెలంగాణ భవన్లో మాట్లాడారు. సింగరేణి స్కాంపై డిప్యూటీ సీఎం భట్టి మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారని చెప్పారు. బొగ్గు స్కాంపై (coal scam) స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీ చేశారని విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. సింగరేణి కుంభకోణానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు.
Harish Rao | అన్ని టెండర్లు రద్దు చేయాలి
భట్టి విక్రమార్క తీరు దొంగే నాకు లేఖ రాయండి విచారణ చేస్తా అన్నట్లుందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. తనకు లేఖ రాస్తే, రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని భట్టి విక్రమార్క అన్నారు. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డే దొంగ అని, ఆయన బావమరిదే మొదటి లబ్ధిదారుడు అని చెబుతుంటే.. ఆయనతో మాట్లాడతానని అంటున్నారని విమర్శించారు. సైట్ విజిట్ విధానాన్ని కాంగ్రెస్ 2025 మేలో తీసుకు వచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. దాని మొదటి లబ్ధిదారుడు రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ షోధా కన్స్ట్రక్షన్స్ అని తెలిపారు. ఆ తర్వాత అన్ని టెండర్లకు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి.. రిగ్ చేశారని ఆరోపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధానంతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు.