అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | ఎన్నికల విధుల్లో చెప్పిన పనిచేయకుండా ఎస్సైకి ఎదురు మాట్లాడిన ఏఆర్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ (Constable Suspention) వేటు పడినట్లు సమాచారం. ఎల్లారెడ్డి సబ్ డివిజన్ (Yellareddy Sub-Division) పరిధిలోని ఓ మండలంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ మరొక మండలంలో ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నాడు.
Kamareddy | బయటకు రాని ఉత్తర్వులు..
సదరు మండలానికి చెందిన ఎస్సై.. ఏఆర్ కానిస్టేబుల్‌ను (AR Constable) పెట్రోలింగ్‌కు వెళ్లాలని చెప్పగా.. తాను ఇప్పుడే వెళ్లి వచ్చానని, మా ఎస్సైకి అడిగి చెప్తానని బదులిచ్చాడు. దాంతో తన మాటకు ఎదురు చెప్తావా అంటూ.. విషయాన్ని సదరు ఎస్సై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా ఏఆర్ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే సస్పెన్షన్‌కు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.