అక్షరటుడే, వెబ్డెస్క్ : Nishikant Dubey | మాజీ ప్రధాన మంత్రులు నెహ్రు, ఇందిరా గాంధీపై బీజేపీ నేత, ఎంపీ నిశికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశంలోని ఒక పర్వతంపై అమెరికా నిఘా పరికరం ఏర్పాటుకు వారు అనుమతి ఇచ్చారని ఆరోపించారు.
చైనాపై నిఘా పెట్టేందుకు 1960వ దశకంలో హిమాలయాలలోని నందా దేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాలను ఏర్పాటు చేయడానికి అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (American Central Intelligence Agency)కి అనుమతి ఇచ్చారని దూబే ఆరోపించారు. ఎక్స్ వేదికగా ఆయన దీనిపై పలు పోస్టులు పెట్టారు. 1964లో నెహ్రూ హయాంలో, 1967, 1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) హయాంలో ఇది జరిగిందని ఆయన పేర్కొన్నారు. అమెరికన్ ఏజెంట్లు వెనక్కి వెళ్లిపోయిన తర్వాత ఆ అణుశక్తి గూఢచర్య పరికరాలను పర్వతంపైనే వదిలేశారని ఆరోపించారు.
Nishikant Dubey | ప్రధాని అంగీకరించారు..
ఉత్తరాఖండ్ (Uttarakhand) నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసించే ప్రజలలో క్యాన్సర్ పెరగడానికి అమెరికన్లు వదిలి వెళ్లిన పరికరాలే కారణమని ఆయన అన్నారు. హిమానీనదాలు కరగడానికి, మేఘ విస్ఫోటనాలకు, ఇళ్లలో పగుళ్లు ఏర్పడటానికి ఇదే కారణమా అని ప్రశ్నించారు. 1978లో లోక్సభలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ దీనిని అంగీకరించారని చెప్పారు. ఇటీవల అమెరికన్ వార్తాపత్రిక ది న్యూయార్క్ టైమ్స్ (The New York Times) ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించిందని దూబె తెలిపారు.దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో సహా నెహ్రూ-గాంధీ కుటుంబం విదేశీ శక్తులకు లొంగిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై 1978లో అమెరికా చట్టసభ సభ్యులు తమ