అక్షరటుడే, నందిపేట్ : Velmal Village | నందిపేట మండలంలో (Nandipet Mandal) మేజర్ గ్రామపంచాయతీ అయిన వెల్మల్‌లో వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్లోని ప్రజావాణిలో (Prajavani) వినతిపత్రం అందజేశారు.
Velmal Village | నాలుగువేల ఆయకట్టు..
తమ జీపీ పరిధిలో నాలుగు వేల ఎకరాల ఆయకట్టు ఉందని.. మేజర్ జీపీ అయిన తమ గ్రామాన్ని వెంటనే ఐలాపూర్ సొసైటీ నుంచి వేరు చేయాలని నాయకులు విన్నవించారు. సరిహద్దు గ్రామాలైన ఆంధ్ర నగర్ (Andhra Nagar), కౌల్పూర్, రైతు ఫారం, జోజిపేట గ్రామపంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని.. ఈ మేరకు సొసైటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్, ఉపసర్పంచ్ ఇసపల్లి మహేష్, మాజీ సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారం, నాయకులు కస్ప రామకృష్ణ, రాము, గోజూరి నరేందర్, కిషన్, జీఆర్ రాజేందర్, మల్లేష్, శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.