Minister Thummala | జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తాం
Minister Thummala | జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తాం

అక్షరటుడే, ఇందూరు: Minister Thummala | జిల్లాకు వ్యవసాయ కళాశాలనుAgricultural College మంజూరు చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలGiriraj Government Degree College మైదానంలో రైతుమేళాను Raithu Mela ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులను చైతన్యం చేసేందుకు, వ్యవసాయంపై అవగాహన పెంచేందుకు రైతు మేళా Raithu Melaలు నిర్వహిస్తున్నామన్నారు.

భరతమాత పాదాలకు పసుపు పారాణి అద్దిన నేల ఇందూరుInduru అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే కేంద్రం పసుపు బోర్డును ఇచ్చిందని, అయితే తొందరగా పూర్తి బాధ్యతతో తీర్చిదిద్దాలని తెలిపారు. రాష్ట్రం ఆర్థికపరంగా బలహీనపడినా ..రైతులకు మేలు చేస్తున్నామని మంత్రి తుమ్మల Minister Thummala అన్నారు. అతి తొందరలోనే పంట నష్టపరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Minister Thummala | కేంద్రం నిర్ణయించిన ధరకే కొంటాం..

సన్​ఫ్లవర్​, జొన్నలు, మక్కలు వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లినా.. కేంద్రం నిర్ణయించిన ధరతో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆయిల్ పామ్Oil palm వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. ఒక ఎకరం వరి పండించే పెట్టుబడితో.. ఆయిల్ పామ్ 5 ఎకరాల్లో పండించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ పండిస్తే పరిశ్రమలు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆదాయం వచ్చే పంటలను పండించాలని రైతులకు సూచించారు.

Minister Thummala | రెండు రోజుల్లో బోనస్​ చెల్లిస్తాం..

– ఉత్తం కుమార్​ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

జిల్లాలో బోనస్​ రాని రైతులకు రెండు రోజుల్లో డబ్బులు వేయిస్తాను. గత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్లకు Pranahitha-Chevella 1.80 కోట్లు ఖర్చు చేసి జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. జిల్లాలో గన్నీబ్యాగులు Gunny bags సరిపడా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసే అధికారులను సస్పెండ్​ చేస్తా. నిజాంసాగర్ ప్రాజెక్ట్​Nizamsagar Project పనులను సంబంధించి నెలాఖరులోపు టెండర్లను కూడా పిలుస్తాం. అలాగే కాళేశ్వరం Kaleshwaram నిరుపయోగంగా ఉన్నా.. రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించడం అభినందనీయం. దేశంలో ఎక్కడా లేనివిధంగా సన్న బియ్యం పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్​ ప్రభుత్వం.

రాష్ట్రం అప్పుల్లో ఉంది…

– జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి

గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఆర్థిక సమస్యలు ఎదురైనా.. ఇచ్చిన మాట ప్రకారం రైతు పథకాలను నెరవేరుస్తున్నాం. ప్రతి నెల రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నాం.. ఇప్పటివరకు 1.40 లక్షలు కేవలం వడ్డీ చెల్లించాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయకుండా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.

మంత్రులను కాదు.. రైతులను విదేశాలకు తీసుకెళ్లండి

– బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, టీపీసీసీ చీఫ్​

వ్యవసాయంపై అవగాహన కలగాలంటే విదేశాలకు మంత్రులను కాకుండా కొందరు ఎంపిక చేసిన రైతులను తీసుకెళ్లాలి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీ ప్రకారం సన్నబియ్యం, రైతుబంధు Raithu Bandhu, మహిళలకు ఉచిత ఆర్టీసీ RTC ప్రయాణం, రైతు భరోసా తదితర పథకాలు అమలు చేస్తున్నాం. కేసీఆర్KCR ముమ్మాటికి పనికిరాని కాళేశ్వరాన్ని కట్టాడు. దానివల్ల ఒక ఎకరం పంటకు నీరు అందించాలంటే రూ.60 వేలు ఖర్చవుతుంది. అనంతరం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి భూపతిరెడ్డి రాకేష్ రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడారు. అనంతరం పలువురు ఆదర్శ రైతులకు సన్మానించారు.