Simhadri Appanna | సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం.. గోడకూలి ఎనిమిది మంది దుర్మరణం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Simhadri Appanna : సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోయిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం Simhadri Appanna Swamy Chandan Festival సందర్భంగా స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండు నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Simhadri Appanna : సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం సంభవించింది. గోడ కూలిపోయిన ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం Simhadri Appanna Swamy Chandan Festival సందర్భంగా స్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సింహాచలంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సింహగిరి బస్టాండు నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ మీద సిమెంటు గోడ కూలిపోయింది.

ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత Home Minister Vangalapudi Anitha, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీసు కమిషనర్​ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను వారు పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు CM Chandrababu Naidu దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

సింహాచలం ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ Deputy CM Pawan Kalyan పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

 

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

DK Aruna comments | ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: ఎంపీ డీకే అరుణ

ఎమ్మెల్యే కేవీఆర్​పై ఆరోపణలు చేసిన షబ్బీర్​అలీ వాటిని నిరూపించి చూపించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో కేవీఆర్​ను ఆమె పరామర్శించారు.

Helmet Bank | ఉచితంగా హెల్మెట్.. ఎక్కడో తెలుసా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Helmet Bank | బైక్​పై వెళ్లేటప్పుడు హెల్మెట్​ లేకపోతే పోలీసులు ఫైన్​ వేస్తారు. ఇక్కడ మాత్రం అలా కాదు. ఉచితంగా...

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణిలో వినతులు స్వీకరించిన సీపీ

పోలీస్​ ప్రజావాణిలో భాగంగా సోమవారం సీపీ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం పోలీస్​డ్యూటీ మీట్​లో పతకాలు సాధించిన సిబ్బందిని అభినందించారు.

Harish Rao contractor payments | చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao contractor payments | రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని మాజీ మంత్రి హరీశ్​రావు...