అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America Accident | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన దంపతులు మృతి చెందారు.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్(45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయారు.
ఈ ఘటనలో వారి కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు అమెరికా నుంచి పాలకొల్లులోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
America Accident | పది రోజుల క్రితం పాలకొల్లుకు..
కృష్ణ కిశోర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer)గా పని చేస్తున్నాడు. దశాబ్దంగా అక్కడే కుటుంబంతో ఉంటున్నాడు. పది రోజుల కిత్రం తన భార్యతో కలిసి ఆయన స్వగ్రామం పాలకొల్లు వచ్చి వెళ్లాడు. తిరిగి వెళ్లే సమయంలో దుబాయిలో న్యూ ఇయర్ వేడుకల్లో సైతం పాల్గొన్నారు. అయితే తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ దంపతులు మృతి చెందారు. కాగా ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) తెలుగు వారు ఎక్కువగా మృతి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
America Accident | ఇద్దరు యువతులు
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇటీవల మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)కు చెందిన ఇద్దరు యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే. గార్ల గ్రామం మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు.. అక్కడ ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారు. ఇటీవల విహార యాత్రకు వెళ్లి వస్తుండగా.. వారి కారు లోయలో పడిపోయింది.