అక్షరటుడే, ఇందూరు : Kakatiya Institutions | విద్యార్థుల్లో గణిత నైపుణ్యాన్ని పెంపొందించడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్ (Sri Rama Garden)లో సోమవారం ‘అకడమిక్ మహోత్సవం’ నిర్వహించారు.
Kakatiya Institutions | ఉన్నత లక్ష్యాలతో..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ విద్యాసంస్థలు (Kakatiya Educational Institutions) ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతుందన్నారు. విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటీ, నీట్ పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే క్రీడల్లో జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ.. ప్రతి ఏడాది నిర్వహించే క్రీడోత్సవాలతో పాటు అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన సిలబస్ ఆధారణంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
Kakatiya Institutions | సామర్థ్యాన్ని పెంపొందించేందుకు..
విద్యార్థులకు ప్రతి సబ్జెక్టులో సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు డైరెక్టర్ రజనీకాంత్ (Director Rajinikanth) తెలిపారు. నిజామాబాద్ (Nizamabad)లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు రామోజీరావు, రాజా ఆయా శాఖల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులను అభినందిస్తున్న కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రజనీకాంత్
