అక్షరటుడే, ఆర్మూర్: Volleyball competitions | ఆర్మూర్ మండలం మగ్గిడి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని అమూల్య (జీజీ కాలేజీ) జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు (national-level volleyball competitions) ఎంపికైనట్లు పీడీ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న జూనియర్ జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొననుందని పేర్కొన్నారు.
Volleyball competitions | రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ..
అమూల్య నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు సిరిసిల్లలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని అత్యున్నత ప్రదర్శన ద్వారా జాతీయ స్థాయికి పోటీలకు ఎంపికైంది. జాతీయస్థాయి పోటీలకు అమూల్య ఎంపిక కావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హనుమంత్ రెడ్డి, జిల్లా వాలీబాల్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్, ట్రెజరర్ గంగారెడ్డి, జిల్లా యువజన, క్రీడల అధికారి పవన్ మగ్గిడి, పాఠశాల హెచ్ఎం తిరునగరి హరిత, వీడీసీ సభ్యులు అభినందించారు.