అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలో అమృత్ 2.0 పథకంలో (Amrut 2.0 scheme) భాగంగా పైప్లైన్ పనులను గురువారం ప్రారంభించారు. పట్టణంలో కొన్నిరోజులు క్రితం సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు ప్రారంభమైనప్పటికీ, వాటర్ పైప్లైన్ పనులు (water pipeline works) పెండింగ్లో పడ్డాయి.
దీంతో రెండో వార్డు మాజీ సభ్యుడు విద్యాసాగర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆయన స్పందించారు. వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. దీంతో గురువారం నుంచి పనులు ప్రారంభం అయ్యాయి. పనులను పరిశీలించిన వారిలో మాజీ వార్డు సభ్యుడు విద్యాసాగర్, కాంగ్రెస్ నాయకులు పాషా, ఇంతియాజ్, మధు ఉన్నారు.
రెండో వార్డులోని బీసీ కాలనీలో సైతం పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభానికి సహకరించిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. కాలనీవాసులు మహేష్, నరేష్ కుమార్ తదితరులున్నారు.

