అక్షరటుడే, వెబ్డెస్క్: Amla | ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఫలాల్లో ఉసిరికాయ ఒకటి. ఆయుర్వేదం Ayurveda లో దీనిని సర్వరోగ నివారిణిగా పిలుస్తారు. విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండే ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జుట్టు , చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా.. ఏదైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉసిరికాయను తీసుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రలేమి, నరాల సమస్యలు: Amla | ఉసిరికాయను రాత్రి సమయాల్లో తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇందులో ఉండే పోషకాలు నరాల వ్యవస్థను అతిగా ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ వేగవంతమై నరాలు బిగుసుకుపోయే అవకాశం ఉంది. ఫలితంగా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపట్టక, నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, సాయంత్రం దాటిన తర్వాత ఉసిరిని తీసుకోకపోవడమే ఉత్తమం.
డీహైడ్రేషన్ బాధితులు: Amla | శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండి, తరచూ డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారు ఉసిరికాయకు దూరంగా ఉండాలి. ఉసిరి శరీరంలోని తేమను తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య మరింత తీవ్రమై, చర్మం పొడిబారడం, నీరసం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
జీర్ణకోశ , గ్యాస్ట్రిక్ సమస్యలు: Amla | ఉసిరికాయలో సహజంగానే ఆమ్ల (Acidic) గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఉసిరిని తింటే, కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగి మంట మరింత ఎక్కువవుతుంది. అలాగే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల పొట్టలో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి.
గర్భిణులు, పాలిచ్చే తల్లులు: Amla | గర్భవతులు, పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు ఉసిరికాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేరుగా జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. అధికంగా ఉసిరిని తీసుకోవడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది, ఇది గర్భిణుల్లో నీరసానికి దారితీస్తుంది.