అక్షరటుడే, ఇందూరు: DS Statue | జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (D. Srinivas) కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి అమిత్షా (Union Minister Amit Shah) ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, డీఎస్ సోదరుడు సురేందర్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా ఛైర్మన్ కేశవేణు, కాంగ్రెస్ నాయకులు జావిద్, ఎంపీ అర్వింద్, ఆయన కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
