అక్షరటుడే, ఇందూరు: Turmeric Board | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ప్రారంభించనున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) తెలిపారు. సోమవారం జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డితో (Palle Gangareddy) కలిసి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కార్యాలయ ప్రారంభోత్సవ అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం జూన్ చివరి వారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కాగా.. నిజామాబాద్‌లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని జాతీయ పసుపు బోర్డుకు (National Turmeric Board) కేటాయిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
