HomeతెలంగాణGanesh immersion | హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనానికి అమిత్ షా రాక

Ganesh immersion | హైదరాబాద్​లో గణేశ్​ నిమజ్జనానికి అమిత్ షా రాక

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh immersion | వినాయక చవితి ఉత్సవాలు హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 6 నిమజ్జన శోభాయాత్ర (Nimajjana Shobha yatra) నిర్వహించనున్నారు.

జంట నగరాల్లో గణేశ్​ ఉత్సవాలు ఏటా వైభవంగా నిర్వహిస్తారు. పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గణనాథులను నిమజ్జనం చేస్తారు.

మహానగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతుంది. వేలాది విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తారు. లక్షలాది మంది భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారు.

కాగా, ఈ ఏడాది జరిగే వినాయక నిమజ్జన శోభాయాత్రలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Union Home Minister Amit Shah) పాల్గొననున్నారు.

Ganesh immersion | ఆహ్వానం మేరకు..

నిమజ్జన శోభాయాత్రకు రావాలని భాగ్యనగర్​ గణేశ్​ ఉత్సవ సమితి అమిత్​ షాను (Amit Shah) ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు ఆయన శోభాయాత్రలో పాల్గొనున్నారు.

ఈ నెల 6న ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీ(Delhi) నుంచి బేగంపేట ఎయిర్​పోర్టుకు (Begumpet Airport) చేరుకుంటారు. ఉదయం 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 1 గంటలకు చార్మినార్​ దగ్గర శోభాయాత్రలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకు ఎంజే మార్కెట్​ దగ్గర ఆయన ప్రసంగిస్తారు.

Ganesh immersion | పోలీసుల ప్రత్యేక నిఘా

హైదరాబాద్​ నిమజ్జన శోభాయాత్రపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే కార్యక్రమం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

వేలాది మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాలతో నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలపై ఫోకస్​ పెడుతున్నారు.

ఇక ప్రధాన శోభాయాత్రకు ఈసారి కేంద్ర హోం మంత్రి రానుండటంతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ఎక్కడ పోరపాటు జరగకుండా పకడ్బందీగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Must Read
Related News