Homeతాజావార్తలుTenneco Clean Air India IPO | ఐపీవోకు అమెరికన్‌ కంపెనీ.. ఆకర్షిస్తోన్న టెనెకో క్లీన్‌...

Tenneco Clean Air India IPO | ఐపీవోకు అమెరికన్‌ కంపెనీ.. ఆకర్షిస్తోన్న టెనెకో క్లీన్‌ ఎయిర్‌ ఇండియా

వెహికల్‌ పార్టులు తయారు చేసే అమెరికన్‌ కంపెనీ టెనెకో క్లీన్‌ ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ మార్కెట్‌నుంచి రూ. 3,600 కోట్లను సమీకరించడం కోసం పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ఈ ఐపీవో పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో ఉంటుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 12న తన ప్రారంభం కానుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenneco Clean Air India IPO | టెన్నెకో క్లీన్‌ ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ను (Tenneco Clean Air India Ltd.) 2018లో స్థాపించారు. ఇది ఆటోమోటివ్‌ అప్లికేషన్ల కోసం క్లీన్‌ ఎయిర్‌, పవర్‌ట్రెయిన్‌ ఉత్పత్తులను రూపొందించడంలో మరియు తయారు చేయడంలో ప్రపంచ అగ్రగామి అయిన టెన్నెకో ఇంక్‌ యొక్క అనుబంధ సంస్థ. ఈ కంపెనీ క్లీన్‌ ఎయిర్‌ (Clean Air) విభాగంలో పనిచేస్తోంది.

తేలికపాటి మరియు వాణిజ్య వాహనాల కోసం ఉద్గార నియంత్రణ సాంకేతికతలపై దృష్టి సారించింది. దేశంలో టెన్నెకో క్లీన్‌ ఎయిర్‌ అధునాతన ఎగ్జాస్ట్‌ మరియు ఆఫ్టర్‌ ట్రీట్‌మెంట్‌ వ్యవస్థలను అందిస్తోంది. వాహన తయారీదారులు భారత్‌ స్టేజ్‌ VI (Bharat Stage VI) వంటి కఠినమైన ఉద్గార నిబంధనలను తీర్చడంలో సహాయపడుతోంది. దీని ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో ఉత్ప్రేరక కన్వర్టర్లు, డీజిల్‌ పార్టిక్యులేట్‌ ఫిల్టర్లు, మఫ్లర్లు మరియు ఎగ్జాస్ట్‌ పైపులు ఉన్నాయి.

ఓఈఎంలు మరియు టైర్‌ 1 కస్టమర్లకు మద్దతు ఇవ్వడానికి కంపెనీ భారతదేశం అంతటా వ్యూహాత్మకంగా తయారీ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి కంపెనీకి దేశంలోని ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఏడు క్లీన్‌ ఎయిర్‌ అండ్‌ పవర్‌ట్రెయిన్‌ సొల్యూషన్స్‌ (Powertrain solutions) సౌకర్యాలు మరియు ఐదు అడ్వాన్స్‌డ్‌ రైడ్‌ టెక్నాలజీ సౌకర్యాలతో సహా 12 తయారీ సౌకర్యాలు ఉన్నాయి.

Tenneco Clean Air India IPO | రూ. 3,600 కోట్లు సమీకరించేందుకు..

టెనెకో క్లీన్‌ ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ మార్కెట్‌నుంచి రూ.3,600 కోట్లను సమీకరించడం కోసం పబ్లిక్‌ ఇష్యూ(Public issue)కు వస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌(OFS). ఐపీవో ద్వారా వచ్చిన నిధులు కంపెనీకి కాకుండా ప్రమోటర్‌ టెనెకో మారిషస్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌కు వెళతాయి.

Tenneco Clean Air India IPO | ఆర్థిక పరిస్థితి..

2023 -24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.5,537.39 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,931.45 కోట్లకు తగ్గింది. ఇదే సమయంలో నికర లాభం(Net profit) రూ.416.79 కోట్లనుంచి రూ. 553.14 కోట్లకు పెరిగింది. ఆస్తులు రూ. 2,831.58 కోట్లనుంచి రూ. 2,98.77 కోట్లకు పెరిగాయి.

Tenneco Clean Air India IPO | ధరల శ్రేణి..

కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని (Price band) రూ. 378 నుంచి రూ. 397గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 37 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం గరిష్ట ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ. 14,689 తో బిడ్‌ వేయాల్సి ఉంటుంది.

Tenneco Clean Air India IPO | కోటా, జీఎంపీ..

క్యూఐబీలకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్లకు జీఎంపీ(GMP) 16.88 శాతం ఉంది.

Tenneco Clean Air India IPO | ముఖ్యమైన తేదీలు..

సబ్‌స్క్రిప్షన్‌ (Subscription) ఈనెల 12న తన ప్రారంభమవుతుంది. 14 వ తేదీన ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ 17న రాత్రి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ షేర్లు 19న ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో లిస్టవుతాయి.

Must Read
Related News