అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tarrifs | అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీలు (American multinational companies) తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trumo) తీరు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇండియాపై 50 శాతం సుంకాలను విధించినప్పటి నుంచి ఆయా కంపెనీలకు మరింత ప్రతికూల పరిణామాలు ఎదురవుతున్నాయి.
అమెరికాకు బుద్ధి చెప్పాలంటే ఆ దేశానికి చెందిన కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ బహిష్కరణ డిమాండ్లు ఒక్క ఇండియాలోనే కాదు, మిగతా దేశాల్లోనూ వినిపిస్తున్నాయి. ఫ్రాన్స్ (France), యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom), కెనడా (Canada) వంటి దేశాల్లో ఇప్పటికే అమెరికన్ వ్యతిరేక బహిష్కరణలు జరుగుతున్నాయి. దీంతో పెప్సి, కోకా-కోలా, సబ్‌వే, కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్ వంటి అమెరికన్ బహుళజాతి సంస్థలు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నాయి.
Trump Tarrifs | ఊపందుకుంటున్న ఉద్యమం..
రష్యా నుంచి చమురు (Russia Oil) కొంటున్నారన్న కారణాన్ని చూపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. అయితే, ఇండియాపై (India) ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వాణిజ్యం పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్‌కు తగిన బుద్ధి చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికన్ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది.
ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిగా అన్ని అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించాలని యోగా గురువు రామ్‌దేవ్ (Ram Dev baba) పిలుపునిచ్చారు. పెప్సి, కోకా-కోలా, సబ్‌వే, కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్ కౌంటర్ల వద్ద ఒక్క భారతీయుడు కూడా కనిపించకూడదని, అంత పెద్ద ఎత్తున బహిష్కరణ జరగాలన్నారు. ఇది జరిగితే అమెరికాలో గందరగోళం ఏర్పడుతుందని, తద్వారా వారు దిగి వస్తారన్నారు.
Trump Tarrifs | స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట
మరోవైపు, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాకు మరింత పదును పెడుతోంది. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఇప్పటికే పిలుపునిచ్చారు. “భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలనుకునే ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా దేశ ప్రయోజనాల గురించి మాట్లాడాలి.
‘స్వదేశీ’ ఉత్పత్తులు కొనాలని ప్రజలు దృఢంగా నిర్ణయించుకోవాలని వారిలో ప్రేరేపించాలి.. మనం ఏదైనా కొనాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒకే ఒక ప్రమాణం ఉండాలి: ఒక భారతీయుడు చెమటలు పట్టి తయారు చేసిన వస్తువులను మనం కొనుగోలు చేయబోతున్నాం. భారత ప్రజల నైపుణ్యాన్ని ఉపయోగించి, భారత ప్రజల చెమటతో భారత ప్రజలు తయారు చేసిన ఏదైనా మనకు ‘స్వదేశీ’. మనం ‘స్థానికులకు స్వరం’ అనే మంత్రాన్ని స్వీకరించాలి” అని ఆయన వివరించారు.
Trump Tarrifs | మిగతా దేశాలదీ అదే బాట..
భారత్ బాటలోనే ఇప్పుడు మరిన్ని దేశాలు అమెరికా ఉత్పత్తుల బహిష్కరణ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా వంటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఇప్పటికే అమెరికన్ వ్యతిరేక బహిష్కరణలు జరుగుతున్నాయి. దీని ఫలితంగా, పెప్సి, కోకా-కోలా, సబ్వే, KFC, మెక్‌డొనాల్డ్స్ వంటి అమెరికన్ బహుళజాతి సంస్థలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. అదే జరిగితే ఆయా సంస్థల బిలియన్ డాలర్ల నష్టం తప్పదు.
146 కోట్ల జనాభా ఉన్న భారత్ లో అమెరికా కంపెనీల (American companies) వ్యాపారం ఏటా బిలియన్ డాలర్లలో భారీగా జరుగుతుంది. మెక్‌డొనాల్డ్స్ కంపెనీ ఇండియాలో ఏటా రూ.2,400 కోట్ల మేర విక్రయాలు సాగిస్తుంది. ఇక, పెప్సీ, కోకాకోలా వంటి కంపెనీల ఆదాయం దాదాపు రూ.10 వేల కోట్ల దాకా ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించడం వల్ల ఆయా సంస్థలు భారీగా నష్టపోయే ప్రమాదముంది.