ePaper
More
    Homeఅంతర్జాతీయంElon Musk | త్వరలోనే అమెరికా దివాళ..! ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

    Elon Musk | త్వరలోనే అమెరికా దివాళ..! ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Elon Musk | ప్రపంచంలో అత్యంత ప్రభావశాలిగా చెప్పుకొనే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్(Tesla CEO Elon Musk) తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం అమెరికా(America)లో రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. అమెరికా త్వరలోనే దివాళ తీసే పరిస్థితికి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

    అమెరికా ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎలన్​ మస్క్.. ఇటీవలే ప్రభుత్వ సలహాదారు బోర్డు నుంచి నిష్క్రమించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రవేశపెట్టిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్'(Big Beautiful Bill)పై తీవ్ర విమర్శలు చేసిన ఎలన్​.. “ఆ బిల్లు అసహ్యకరమైనది.. దీనికి మద్దతిచ్చిన వాళ్లు సిగ్గుపడాలి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

    ఎలన్​ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా(US) ప్రభుత్వ ఖర్చులు, వ్యయ నియంత్రణలో విఫలం, అప్పుల భారం వంటి అంశాలపై తీవ్ర విమర్శలుగా పరిగణిస్తున్నారు. ఆయన అపార అనుభవం, మార్కెట్‌ పర్యవేక్షణపై ఉన్న విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే.. ఎలన్​ అంచనాలు రాజకీయంగానే కాదు, ఆర్థికంగానూ గంభీరంగా పరిగణించవలసిందేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

    Elon Musk’s sensational comments : రాజకీయ నాయకులు, నెటిజన్ల స్పందన

    సామాజిక మాధ్యమాల్లో ఎలన్​ మస్క్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కొందరు ఎలన్​ మస్క్‌ను అభినందిస్తున్నారు. మరికొందరు ఆయన వ్యాఖ్యలను బాధ్యతారహితంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఎలన్​ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...