ePaper
More
    Homeఅంతర్జాతీయంAmerica | విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్​

    America | విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :America | అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఆ దేశం మరో షాక్​ ఇచ్చింది. ఇప్పటికే వీసా నిబంధనలు (Us Visa Regulations) కఠినతరం చేసిన ఆ దేశం.. అక్కడ ఉన్న వారిపై కూడా ఆంక్షలు విధిస్తోంది. ఇటీవల పలువురి వీసాలు రద్దు చేయగా వారు కోర్టుకు వెళ్లడంతో ట్రంప్​ సర్కార్​(Trump Government) వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

    తాజాగా అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులు(Foreign Students in United States) వీసా నిబంధనల మేరకు తరగతులకు హాజరు కావాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. తరగతులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. స్టడీ ప్రోగ్రామ్స్​(Study Programs)కు హాజరు కాకపోయినా తీవ్ర చర్యలు ఉంటాయని పేర్కొంది. వీసా రద్దుతో పాటు అమెరికాకు రాకుండా అనర్హులుగా ప్రకటిస్తామంటూ హెచ్చరించింది.

    America | భారత విద్యార్థులకు కష్టమే..

    అమెరికాకు చదువు కోసం వెళ్లిన భారత విద్యార్థుల్లో చాలా మంది పార్ట్​ టైం జాబ్​(Part Time Job in US) చేస్తుంటారు. అనధికారికంగా అక్కడ పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. కాలేజీలకు వెళ్లకుండా పార్ట్​ టైం పనులు చేస్తుంటారు. చాలా కాలేజీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ఫీజులు కట్టించుకొని కాలేజీలకు వెళ్లకపోయినా ఏమీ అనవు. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత విద్యార్థుల(Indian Students)పై భారం పడనుంది.

    ఎంతోమంది అప్పులు చేసి అమెరికా వెళ్తారు. అక్కడ పార్ట్​ టైం పనులు చేసుకొని అప్పులు తీర్చుకోవడంతో పాటు కాలేజీ ఫీజులు(College Fees) చెల్లిస్తారు. తీరా ఇప్పుడు తప్పకుండా కాలేజీలకు హాజరు కావాలని చెప్పడంతో పార్ట్​ టైం జాబ్​ చేసే వారికి ఇబ్బందులు రానున్నాయి. తల్లిదండ్రులు ఇంటి నుంచి డబ్బులు పంపించాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. అగ్రరాజ్యం తాజా నిర్ణయంతో ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులకు సైతం ఇది షాకింగ్ వార్తే అని చెప్పాలి.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈలో జరిగిన ఆసియా కప్ Asia Cup తొలి మ్యాచ్​లో...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...