అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Trump Tariffs | రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై సుంకాలు విధించడానికి గల కారణాలను అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆంక్షలు విధించారని వైట్ హౌస్ వెల్లడించింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే మాస్కోపై మరింత ఒత్తిడిని తీసుకురావడానికి ఇండియాపై సుంకాలు (Tariffs on India) విధించారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తూ రష్యా యుద్ధానికి భారత్ సహకరిస్తోందంటూ ట్రంప్ ఇండియాపై రెండు విడుతల్లో కలిపి 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే.
Trump Tariffs | యుద్ధాన్ని ముగించడానికి..
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని (Russia – Ukraine war) ముగించడానికి అధ్యక్షుడు ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తన్నారని అందులో భాగమే భారత్‌పై టారిఫ్‌లు అని లీవిట్ తెలిపారు. రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించే దేశాలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహమని, అందులో భాగంగానే భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారని గుర్తు చేశారు.
“ఈ యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. భారతదేశంపై ఆంక్షలు, ఇతర చర్యలను కూడా ఆయన తీసుకున్నారు. ఈ యుద్ధం ముగియాలని కోరుకుంటున్నానని ట్రంప్ చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. ఏదైనా సమావేశం జరగడానికి ముందు మనం మరో నెల వేచి ఉండాలని లేవనెత్తిన ఇతరుల ఆలోచనలను ఆయన ఎగతాళి చేశారు” అని లీవిట్ వ్యాఖ్యానించారు.
వైట్ హౌస్‌లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ మధ్య భేటీ జరిగిన తర్వాతి రోజే ఆమె ఇలా స్పందించడం గమనార్హం. యుద్ధ విరమణకు అమెరికా (America) సమక్షంలో త్రైపాక్షిక చర్చలు జరిపేందుకు రష్యా, ఉక్రెయిన్ అంగీకరించాయి. సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కీలక భేటీ రెండు వారాల్లోపు జరుగవచ్చని భావిస్తున్నారు.
Trump Tariffs | ట్రంప్ వల్లే యుద్ధానికి ముగింపు..
భారతదేశం-పాకిస్తాన్ మధ్య భీకరంగా మారుతున్న యుద్ధాన్ని ట్రంప్ నివారించారని లీవిట్ పునరుద్ఘాటించారు. “భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం ముగియడాన్ని మనం చూశాము, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండటం వల్లే ఇది సాధ్యమైంది. బలమైన, పరపతిని నమ్మే అధ్యక్షుడు లేకుంటే ఇరు దేశాల మధ్య సంఘర్షణ అణు యుద్ధానికి దారితీసేది” అని లీవిట్ అన్నారు. ఇండియా, పాక్ వివాదాన్ని ముగించడానికి ట్రంప్ వాణిజ్యాన్ని చాలా శక్తివంతమైన మార్గంలో పరపతి” ఉపయోగించారని లీవిట్ తెలిపారు.