CM Revanth Reddy
CM Revanth Reddy | ట్రంప్ చేష్ట‌ల‌తో అమెరికాకే న‌ష్టం.. టారిఫ్‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ వ్యాఖ్య‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వ్య‌వ‌హార శైలి ఆ దేశానికే న‌ష్ట‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఢిల్లీలో జ‌రిగిన స‌ద‌స్సులో ప్రసంగించిన ఆయ‌న‌.. టారిఫ్‌ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌పై సుంకాలు విధించ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు.

మ‌న‌స్సులో ఏది తోస్తే అది చేసే వారు ఎక్కువ రోజులు మ‌నుగ‌డ సాగించ‌లేర‌న్నారు. తెలంగాణ‌లోనూ ఒక ట్రంప్ ఉండేవార‌ని కేసీఆర్‌(KCR)ను ఉద్దేశించి విమ‌ర్శించారు. త‌న‌కు న‌చ్చిన‌ట్టు పాల‌న చేయ‌డంతో ప్ర‌జ‌లు ఓడించారని గుర్తు చేశారు. ట్రంప్‌కు కూడా ఒక‌రోజు ఇదే ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy | మ‌నకేం న‌ష్టం లేదు..

ట్రంప్ రాత్రి క‌ల‌లో అనుకున్న‌ది ప‌గ‌లు అమలు చేస్తున్నారని విమ‌ర్శించారు. అమెరికా అధ్య‌క్షుడు పూట‌కో మాట మాట్లాడుతున్నార‌ని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ట్రంప్ ఒక‌రోజు మోదీ నాకు మిత్రుడు అంటాడు. ఆ వెంట‌నే 50 శాతం టారిఫ్​లు విధిస్తాడని తెలిపారు. మ‌రో మూడేళ్లు మాత్ర‌మే ట్రంప్ త‌న‌కు న‌చ్చింది చేయ‌గ‌ల‌రని, ఆ త‌ర్వాత ఆయ‌న దిగిపోక త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారు ఎక్కువ రోజులు పాల‌న కొన‌సాగించలేర‌ని తెలిపారు. భార‌తీయుల‌కు వీసాలు ఇవ్వ‌కుంటే న‌ష్ట‌పోయేది అమెరికానేన‌ని స్ప‌ష్టం చేశారు. ల‌క్ష‌లాది మంది భార‌తీయులు అమెరికా (America) అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని చెప్పారు. భార‌తీయుల‌కు వీసాలు ఇవ్వొద్ద‌ని భావిస్తే అది అమెరికాకు న‌ష్టం త‌ప్ప మ‌న దేశానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌న్నారు.