HomeUncategorizedIndia Economy | అందనంత ఎత్తులో అమెరికా.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానంలో భారత్‌

India Economy | అందనంత ఎత్తులో అమెరికా.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో నాలుగో స్థానంలో భారత్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Bharath | ప్రస్తుతం భారత (Bharath) ఆర్థిక వ్యవస్థ అతివేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక మైలురాళ్లను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవలే జపాన్‌(Japan)ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుంది. మూడో స్థానానికి రావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కాగా ఇప్పటికీ అందనంత ఎత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉంది. ఆ తర్వాత రేసులో చైనా, జర్మనీ ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund) సంస్థ ఇటీవల ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఏ ఏ దేశాలు ఉన్నాయో తెలుసుకుందామా..

Bharath | అమెరికా(America)

అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్దదిగా కొనసాగుతోంది. ఐఎంఎఫ్‌(IMF) అంచనాల ప్రకారం ఆ దేశ జీడీపీ 30.5 ట్రిలియన్‌ డాలర్లు.

Bharath | చైనా(China)

యూఎస్‌(US)తో పోటీ పడుతున్న చైనా.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో రెండో స్థానాన్ని నిలుపుకుంది. ఆ దేశ జీడీపీ 19.23 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది.

Bharath | జర్మనీ(Germany)

జర్మనీ మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశ జీడీపీ 4.74 ట్రిలియన్‌ డాలర్లు.

Bharath | భారత్‌ (Bharath)

కొన్నేళ్లుగా స్థిరమైన వృద్ధిని సాధిస్తున్న భారత్‌.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో నాలుగో స్థానంలో నిలిచింది. ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం మన దేశ జీడీపీ 4.187 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇతర దేశాలతో పోల్చితే ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతుండడంతో 2027 నాటికి జర్మనీని దాటి మూడో స్థానానికి చేరుతుందని భావిస్తున్నారు.

Bharath | జపాన్‌(Japan)

జపాన్‌ ఐదో స్థానంలో నిలిచింది. ఆ దేశ జీడీపీ 4.186 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

Bharath | యూకే(UK)

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఆరో స్థానంలో ఉంది. దాని జీడీపీ 3.83 ట్రిలియన్‌ డాలర్లు.

Bharath | ఫ్రాన్స్‌ (France)

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఫ్రాన్స్‌ ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఐఎంఎఫ్‌ ఆ దేశ జీడీపీని 3.2 ట్రిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది.

Bharath | ఇటలీ(Italy)

ఇటలీ తన స్థానాన్ని మెరుగు పరచుకుని ఎనిమిదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం దాని జీడీపీ 2.42 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది.

Bharath | కెనడా(Canada)

కెనడా సైతం తన స్థానాన్ని మెరుగు పరచుకుంది. 2.22 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో తొమ్మిదో స్థానంలో ఉంది.

Bharath | బ్రెజిల్‌(Brazil)

బ్రెజిల్‌ గతంలో ఎనిమిదో స్థానంలో ఉండేది. ప్రస్తుతం పదో స్థానానికి పడిపోయింది. ఆ దేశ జీడీపీ 2.12 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందని ఐఎంఎఫ్‌(IMF) అంచనా వేసింది.

Must Read
Related News