HomeసినిమాAmeesha Patel | పాతికేళ్ల కుర్రాడితో డేటింగ్‌కి రెడీ.. 50 ఏళ్ల హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Ameesha Patel | పాతికేళ్ల కుర్రాడితో డేటింగ్‌కి రెడీ.. 50 ఏళ్ల హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలీవుడ్ అందాల తార అమీషా పటేల్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ‘కహో నా ప్యార్ హై’, ‘బద్రి’, ‘నాని’ వంటి చిత్రాలతో స్టార్‌హీరోయిన్‌గా వెలుగొందిన అమీషా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ–వివాహ విషయాలపై బోల్డ్ క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ameesha Patel | కొన్ని సినిమాలు చేసినా స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ (Bollywood Heroine) అమీషా పటేల్ మళ్లీ వార్తల్లో నిలిచారు. 2000లో ‘కహో నా ప్యార్ హై’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమీషా తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

అనంతరం పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’, మహేష్ బాబు–ఎన్టీఆర్‌లతో చేసిన సినిమాల ద్వారా సౌత్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలం విరామం తీసుకున్న ఆమె సన్నీ డియోల్‌తో చేసిన ‘గదర్ 2’ భారీ విజయంతో తన రెండో ఇన్నింగ్స్‌కు ఘనంగా శ్రీకారం చుట్టింది.

Ameesha Patel | మ‌ళ్లీ వార్త‌ల‌లోకి..

అమీషా (Ameesha Patel) కెరీర్‌తో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా తరచూ చర్చనీయాంశమవుతూ ఉంటుంది. 50 ఏళ్ల వయసులో కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడం, గత ప్రేమ కథలు, తాజా డేటింగ్ రూమర్స్ ఆమెను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతుంటాయి. ఇటీవల ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె డేటింగ్ చేస్తోందన్న టాక్ కూడా బాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేసింది. అయితే ఈ రూమర్లపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.ఈ నేపథ్యంలో అమీషా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డేటింగ్–పెళ్లి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “నా వయసుకు సగం ఉన్న కుర్రాళ్లు కూడా నాకు డేటింగ్ ఆఫర్లు (Dating Offers) ఇస్తుంటారు. నేను వాటిని సీరియస్‌గా తీసుకోను. కానీ మంచి వ్యక్తి అయితే ఏ వయసైనా ఓపెన్‌గా ఆలోచిస్తా” అని చెప్పింది. అలాగే,పెళ్లి విష‌యంలో నేను ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటాను. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే వయసు ఏమాత్రం అడ్డంకి కాదు. ఏజ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే” అంటూ క్లారిటీ ఇచ్చింది.

అమీషా కామెంట్స్ సోషల్ మీడియాలో (Social Media) వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. “కొంచెం ట్రై చేస్తే లైఫ్ సెట్ అవుతుందేమో!” అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ‘గదర్ 2’ విజయంతో మళ్లీ వరుస ఆఫర్లు అందుకుంటున్న అమీషా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. 50 ఏళ్లు దాటినా తన ఫిట్‌నెస్, స్టైల్‌తో యువ హీరోయిన్లకూ టఫ్ కంపిటీషన్ ఇస్తూ మరోసారి వార్త‌ల‌లోకి వచ్చింది.

Must Read
Related News