అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ameerpet Fire Accident | హైదరాబాద్ (Hyderabad)లోని అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైత్రీవనం (Maitrivanam)లో గల నీలగిరి బ్లాక్‌లో గల నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు.. నీలగిరి బ్లాక్ (Nilgiri Block)లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతోంది. కాగా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Ameerpet Fire Accident | ఎప్పుడూ రద్దీగా అమీర్‌పేట
అమీర్ పేట ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. రకరకాల కోచింగ్ సెంటర్లకు ఫేమస్ అనే విషయం తెలిసిందే. అక్కడ నిత్యం వేల మంది విద్యార్థులు కోచింగ్ కోసం వస్తుంటారు. ఇంత రద్దీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం కలకలం సృష్టిస్తోంది. కాగా.. మంటలు మరింత చెలరేగకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
#HYDTPinfo
🚨 Traffic Alert – Fire Incident Impact 🚨
Due to a fire accident near Maitrivanam Junction, coupled with heavy traffic flow, vehicular movement is slow from SR Nagar Road and Maitrivanam Junction towards Satyam Theatre Road.
Traffic personnel are on the spot… pic.twitter.com/LlkiADtbtj— Hyderabad Traffic Police (@HYDTP) February 20, 2026