అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Traffic Police | అంబులెన్స్ డ్రైవర్ (ambulance driver) డ్రంకన్ డ్రైవ్లో దొరికాడు. నిజామాబాద్ నగరంలోని (Nizamabad city) వర్ని చౌరస్తా వద్ద డ్రంక్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 15 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. ఇందులో ఓ అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉండటం గమనార్హం. పోలీసులు వారి వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.
Traffic Police | పేషెంట్ లేకున్నా సైరన్
నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన ముదునూరి నాగరాజు అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మద్యం తాగి అంబులెన్స్ నడపడమే కాకుండా.. రోగులు లేకున్నా సైరన్ మోగిస్తూ న్యూసెన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడాలని ఆర్టీవో అధికారులకు పంపుతామన్నారు. అంబులెన్స్ డ్రైవర్లు మద్యం తాగి నడిపినా, పేషేంట్లు లేకున్నా సైరెన్ వేసినా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ హెచ్చరించారు. తనిఖీల్లో ఎస్సై వంశీకృష్ణ, ఆర్ఎస్సై శ్రీనివాస్ గౌడ్, ఏఎస్సై అనిల్ పాల్గొన్నారు.