ePaper
More
    HomeజాతీయంChhattisgarh | పీక‌ల‌దాకా తాగి వ‌చ్చిన ఉపాధ్యాయుడు..మైకంతో క్లాస్ రూమ్‌లో ఏం చేశాడంటే…!

    Chhattisgarh | పీక‌ల‌దాకా తాగి వ‌చ్చిన ఉపాధ్యాయుడు..మైకంతో క్లాస్ రూమ్‌లో ఏం చేశాడంటే…!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే దారితప్పే పరిస్థితులు చూస్తుంటే మనం కలత చెందక మానలేం. తాజాగా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో చోటుచేసుకున్న ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ టీచర్ (School Teacher) మద్యం మత్తులో స్కూల్‌కు వచ్చి, పిల్లల సమక్షంలో విచ్చలవిడిగా ప్రవర్తించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన అంబికాపూర్‌ జిల్లా(Ambikapur District) వాద్రాఫ్‌నగర్ బ్లాక్ పరిధిలోని రూప్పూర్ ప్రాథమిక పాఠశాల(Rooppur Primary School)లో చోటు చేసుకుంది. ఇక్కడ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మన్మోహన్ సింగ్ అనే టీచర్ ఆగస్టు 8న (శుక్రవారం) మద్యం సేవించి స్కూల్‌కు హాజరయ్యాడు.

    Chhattisgarh | ఇలా త‌యార‌య్యారేంట్రా..

    ఉపాధ్యాయుడు స్కూల్‌కు తగని దుస్తులు ‘‘బోల్ బామ్’’ అనే వచనం ఉన్న టీషర్ట్‌, షార్ట్స్‌తో తరగతి గదిలో ప్రవేశించాడు. టేబుల్ మీద కాళ్లు పెట్టుకొని, పుస్తకాలని తొక్కుతూ ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతూ పిల్లలకు బోధించాడట. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, ఈ ఉపాధ్యాయుడు గతంలోనూ తరచూ మద్యం తాగి స్కూల్‌కు వచ్చాడని చెబుతున్నారు. దీని గురించి వారు విద్యాశాఖ అధికారులకు(Education Officers) పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకూ కేవలం నోటీసులు ఇచ్చి మళ్లీ అనుమతించినట్టు సమాచారం.

    తన ప్రవర్తనపై ప్రశ్నించగా, మన్మోహన్ సింగ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. గతంలో జరిగిన ప్రమాదంలో తన కాలు విరిగిందనీ, నడవడానికి తాను చికిత్స తీసుకుంటున్నానని చెప్పాడు. ‘‘ప్రతిరోజూ 100 నుండి 200 గ్రాముల మద్యం తాగితేనే నడవగలనని డాక్టర్ చెప్పాడు. అందుకే తాగుతున్నా’’ అంటూ మద్యం సేవించ‌డాన్ని సమర్థించుకున్నాడు. ఈ అంశంపై వాద్రాఫ్‌నగర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్యామ్ కిషోర్ జైస్వాల్(Education Officer Shyam Kishore Jaiswal) స్పందించారు. ‘‘ఈ ఘటనపై మన్మోహన్ సింగ్‌కు తుది హెచ్చరికతో నోటీసు జారీ చేశాం. దర్యాప్తు నివేదికను డీఈఓ, జిల్లా కలెక్టర్‌కు పంపించాం. ఈ నివేదికలో సస్పెన్షన్‌కు కూడా సిఫార్సు చేశాం’’ అన్నారు. ఉపాధ్యాయులే ఇలా ప్రవర్తిస్తే, విద్యార్థులపై దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధం చేసుకోవాలి.

    Latest articles

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    Office Politics | ఆఫీసులో నచ్చని వారితో కలిసి పనిచేయడం ఎలా?

    అక్షరటుడే, హైదరాబాద్ : Office Politics | ఆఫీసులో ఉద్యోగం(Office Job) అంటే కేవలం పని చేయడం మాత్రమే...

    Freeze Chicken | ఫ్రిజ్‌లోని చికెన్ తింటున్నారా? అయితే మీకు ఆ రిస్క్ ఎక్కువ

    అక్షరటుడే, హైదరాబాద్ : Freeze Chicken | ఆధునిక జీవనశైలిలో చాలామంది సౌలభ్యం కోసం చికెన్‌ను ఎక్కువ మొత్తంలో...

    More like this

    CM Revanth Reddy | ​ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. అధికారులకు కీలక సూచనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భారీ వర్షాలతో వరద ముంపునకు...

    Women safety | మహిళలూ.. క్యాబ్‌లో ఒంటరిగా జర్నీ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

    అక్షరటుడే, హైదరాబాద్: Women safety | ఉరుకుల పరుగుల జీవనంలో క్యాబ్‌లలో ప్రయాణించడం చాలా సౌకర్యంగా మారింది. కానీ,...

    Office Politics | ఆఫీసులో నచ్చని వారితో కలిసి పనిచేయడం ఎలా?

    అక్షరటుడే, హైదరాబాద్ : Office Politics | ఆఫీసులో ఉద్యోగం(Office Job) అంటే కేవలం పని చేయడం మాత్రమే...