అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amberpet | హైదరాబాద్ hyderabad నగరంలో నిర్మించిన అంబర్పేట్ ఫ్లై ఓవర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రారంభించారు. రూ.415 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ kagaz nagarలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.5,416 కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి union minister kishan reddy మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చాలా రహదారులను కేంద్రం హైవేలుగా మారుస్తోందన్నారు.
అంబర్‌పేట ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ ఫ్లై ఓవర్‌ను కేంద్రం నిర్మించింది. వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణంతో నగరవాసులకు ఎంతో మేలు జరగనుంది. అయితే ఫ్లై ఓవర్ నిర్మాణం గతంలోనే పూర్తయింది. దీంతో చాలా రోజుల నుంచే వాహనాలను ఫ్లై ఓవర్ మీదుగా అనుమతిస్తున్నారు. బ్రిడ్జి కింద పలు పనులు ఇటీవల పూర్తి చేశారు. తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ అంబర్పేట్ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు.