అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ambati Rambabu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా(OG Movie) రిలీజ్‌కు ముందే విపరీతమైన హైప్ తెచ్చుకుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేయగా, బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ సరికొత్త చర్చకు తెరలేపారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.
సాధారణంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు వ్యతిరేకంగా మాట్లాడే అంబటి, ఈసారి మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. “ఓజీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారు, దర్శకుడు పట్టుదలతో పని చేశారు, నిర్మాత దానయ్య బడ్జెట్‌కి వెనుకాడలేదు” అని చెప్పడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో పవన్ పై ప్రశంసలు అంబటి నోటా రావడం ఇదే మొదటిసారి కాబోలు! అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చలు షురూ అయ్యాయి.
Ambati Rambabu | అంబటి రాంబాబు ఏమన్నారు?
పవన్ కళ్యాణ్ గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాయి. కానీ ‘ఓజీ’ విషయంలో ఆయన పూర్తి డెడికేషన్‌తో పని చేశారని భావిస్తున్నాను. దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య ..ఇద్దరూ ఈ సినిమాను హిట్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ చిత్రం మంచి ఫలితాలు ఇస్తుందని నమ్ముతున్నాను. రాజకీయంగా పవన్ మా ప్రత్యర్థి అయినా… సినిమాపై సద్విమర్శలే చేస్తాం” అని స్పష్టంగా తెలిపారు అంబటి.
అంబటి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పందన మాత్రం ఊహించని రీతిలో కనిపిస్తోంది. “అంబటి రాంబాబు(Ambati Rambabu) అసెంబ్లీ సమస్యలపై మాట్లాడాల్సిన సమయంలో OG రివ్యూలు ఎందుకు?”, “ఇది రాజకీయ వ్యూహమా? లేక సినిమా ఫ్యాన్ మూమెంటా?”, “తొలిసారి పవన్ సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చిన వైసీపీ నేత” అంటూ నెటిజన్లు సెటైర్లు, జోక్స్ పేల్చుతున్నారు. ఇక డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. ప్రత్యేక ప్రదర్శనలతో సినిమా బుధవారం రాత్రి నుంచే ప్రేక్షకుల ముందుకు రానుండగా, తొలి రోజు నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పవన్ సినిమాపై అంబటి ప్రశంసలు, నెటిజన్ల సెటైర్లు, OG పైన హైప్ ఇవన్నీ కలిపి సినిమా ప్రమోషన్‌కు మరింత బూస్ట్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.