ePaper
More
    Homeఅంతర్జాతీయంfake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి...

    fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fake embassy : నకిలీ ఠాణాలు, నకిలీ హాస్పిటల్స్, ఫేక్​ బ్యాంక్స్ ఇప్పటి వరకు చూశాం.. తాజాగా ఫేక్​ ఎంబసీ కార్యాలయం కూడా వెలుగుచూసింది. ఉత్తర్​ప్రదేశ్‌ Uttar Pradesh లో ఓ వ్యక్తి ఏకంగా నకిలీ రాయబార కార్యాలయం ఏర్పాటు చేశాడు.

    ప్రపంచంలోనే లేని కంట్రీలకు రాయబారిగా ప్రకటించుకుని భారీ మోసానికి తెర లేపాడు ఆ ఘనుడు. లగ్జరీ కార్లలో తిరుగుతున్నాడు. వాటిపై ఎంబసీ స్టిక్కర్లు అతికించాడు. ప్రధాని నరేంద్ర మోడీ Prime Minister Narendra Modi, ఇతర ప్రముఖుల ఫొటోలు వాడుకుని పెద్ద జాబ్ రాకెట్​నే కొనసాగిస్తున్నాడు.

    fake embassy : వివరాల్లోకి వెళితే…

    ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్‌ Ghaziabad లో హర్షవర్ధన్​ Harsh Vardhan ఉన్నాడు. ఇతగాడు నకిలీ రాయబార కార్యాలయం నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కవి నగర్ ఏరియాలో ఉన్న ఓ భారీ భవంతిని అద్దెకు తీసుకున్న హర్షవర్ధన్​ అందులో ఫేక్​ ఎంబసీ ఆఫీస్​ నడుపుతున్నాడు.

    READ ALSO  Haryana | సరదా జోక్‌ నిజమైంది.. భర్త కళ్ల ముందే భార్య మృతి

    హర్షవర్ధన్​ ఘన కార్యాలను ఉత్తర్​ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఇతగాడు ప్రపంచంలో గుర్తింపులేని వెస్ట్ ఆర్కిటికా West Arctica, పౌల్వియా Paulvia, సబోర్గా Saborgha, లోడోనియా Lodonia వంటి చిన్న దేశాలకు రాయబారిగా ప్రకటించుకున్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఉన్నతాధికారులతో కలిసి ఉన్నట్లుగా ఫొటోలు ఎడిట్​ చేసి, ప్రదర్శించుకున్నాడు. వాహనాలకు ఫేక్​ నంబర్​ ప్లేట్​లు పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నాడు.

    fake embassy : హవాలా…

    ఫేక్ ఎంబసీ మాటున పెద్ద బ్లాక్​ దందా నడుపుతున్నాడు హర్షవర్ధన్​. షెల్ కంపెనీలు క్రియేట్ చేసి హవాలా Hawala  (అక్రమ నగదు బదిలీ) దందా కొనసాగిస్తున్న విచారణలో తేలింది. ఇతగాడి వద్ద 2011లోనే శాటిలైట్​ ఫోన్​ satellite phone ఉన్నట్లు తేలింది.

    fake embassy : ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం..

    గుర్తింపులేని చిన్న దేశాలకు రాయబారిగా హర్షవర్ధన్​ చెప్పుకొంటూ ప్రజలను నమ్మించాడు. దౌత్యవేత్తగా చెప్పుకొనే హర్షవర్ధన్​.. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చాలా మంది యువతను నిలువునా మోసగించాడు.

    READ ALSO  Israel | గాజాపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు

    fake embassy : అంతర్జాతీయ క్రిమినల్స్ తో సంబంధాలు..

    నకిలీ ఎంబసీ కేసులో పట్టుబడిన హర్షవర్ధన్​కు అంతర్జాతీయ క్రిమినల్స్ తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. అంతర్జాతీయ స్థాయిలో ఆయుధ వ్యాపారం చేసే వివాదాస్పద అద్నాన్ ఖషోగ్గి Adnan Khashoggi, చంద్రస్వామి Chandraswami వంటి వారితో సంబంధాలు నెరిపినట్లు తేలింది.

    fake embassy : ఎవరు వీరు..

    • సౌదీ అరేబియా Saudi Arabia కు చెందిన వ్యాపారవేత్త అద్నాన్ ఖషోగ్గి. ఈయన వెస్టర్న్ డిఫెన్స్ కాంట్రాక్టర్లు, మిడిల్ ఈస్టర్న్ గవర్నమెంట్స్‌ తోపాటు సౌదే అరేబియాకు ఆయుధాలు సరఫరా చేసే డీలింగ్స్ లో మధ్యవర్తిత్వం నెరిపేవాడు. 1980 దశకంలో ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకడుగా అద్నాన్​ వెలిగాడు. లండన్‌లో జూన్ 6, 2017న మరణించాడు.
    • ఇక చంద్రస్వామి స్వయంప్రకటిత దేవుడిగా ప్రకటించుకున్న వ్యక్తి. భారత్​తోపాటు విదేశాల్లోని పలువురు రాజకీయ నాయకులకు సలహాదారుగా కొనసాగాడు. దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు సందర్భంలో వార్తల్లో ప్రధానంగా నిలిచాడు.
    READ ALSO  Dhankhar resigns | ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాపై స్పందించిన ప్ర‌ధాని.. విశేష సేవలు అందించార‌ని ప్ర‌శంస‌లు..

    Latest articles

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...

    Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం...

    KCR KIT | కేసీఆర్ కిట్ కోసం కేటీఆర్​కు ట్వీట్.. తర్వాత ఏం జరిగిందంటే..?

    అక్షరటుడే, గాంధారి: KCR KIT | కేసీఆర్ కిట్ కోసం ఓ వ్యక్తి కేటీఆర్​కు (KTR) ట్వీట్ చేయడంతో,...

    Scanning Centers | స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Scanning Centers | జిల్లాలో కొనసాగుతున్న స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీలు చేయాలని కలెక్టర్ వినయ్...

    More like this

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...

    Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం...

    KCR KIT | కేసీఆర్ కిట్ కోసం కేటీఆర్​కు ట్వీట్.. తర్వాత ఏం జరిగిందంటే..?

    అక్షరటుడే, గాంధారి: KCR KIT | కేసీఆర్ కిట్ కోసం ఓ వ్యక్తి కేటీఆర్​కు (KTR) ట్వీట్ చేయడంతో,...