ePaper
More
    Homeబిజినెస్​Reliance Jio | బ్రాడ్‌ బ్యాండ్‌ రంగంలోనూ అంబానీదే అగ్రస్థానం.. టాప్‌లో రిలయన్స్‌ జియో!

    Reliance Jio | బ్రాడ్‌ బ్యాండ్‌ రంగంలోనూ అంబానీదే అగ్రస్థానం.. టాప్‌లో రిలయన్స్‌ జియో!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Reliance Jio | దేశీయ బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌(Domestic brad band market)లో రిలయన్స్‌ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మార్కెట్‌లో సగానికిపైగా వాటాతో అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

    ట్రాయ్‌(TRAI) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం జియో 50.53 శాతం వాటాతో దేశంలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా(Vodafone Idea), బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్నాయి.

    టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(TRAI) ఏప్రిల్‌ 30 నాటికి దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌ వివరాలను ఇటీవల విడుదల చేసింది. దేశంలో మొత్తం 944.12 మిలియన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లున్నారు. ఇందులో రిలయన్స్‌ జియో (Reliance Jio) 50.53 శాతం వాటా కలిగి ఉంది. వేగవంతమైన 5G రోల్‌అవుట్‌, ఫైబర్‌ టు ది హోమ్‌ సేవల విస్తరణతో దేశంలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటోంది. సరసమైన ధరలకు వివిధ రకాల ప్లాన్‌లను అందుబాటులో ఉంచడం కూడా జియో ఆదరణకు ఒక కారణంగా భావిస్తున్నారు.

    Reliance Jio | రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌..

    బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో భారతి ఎయిర్‌టెల్‌ (Bharathi Airtel) రెండో స్థానంలో ఉంది. దేశీయ బ్రాడ్‌ బ్యాండ్‌ మార్కెట్‌లో 30.68 శాతం వాటా ఈ సంస్థదే.. 13.32 శాతం వాటాతో వొడాఫోన్‌ ఐడియా, 3.63 శాతం వాటాతో బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇతర చిన్నచిన్న సర్వీస్‌ ప్రొవైడర్లు(Service providers) నామమాత్రపు వాటాను కలిగి ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...