HomeUncategorizedAmazon Prime | అమెజాన్ ప్రైమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆందోళ‌న‌లో చిన్మ నిర్మాత‌లు

Amazon Prime | అమెజాన్ ప్రైమ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆందోళ‌న‌లో చిన్మ నిర్మాత‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Amazon Prime | ఈ మ‌ధ్య సినీ ప్రియులు ఓటీటీ(OTT)ల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతున్నారు. థియేట‌ర్స్‌లో Theatres క‌న్నా ఓటీటీ కంటెంట్‌పై ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) ఇండియాలో తన స్ట్రీమింగ్ సేవలో కీలక మార్పును ప్రకటించింది. 2025 జూన్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో సినిమాలు, టీవీ షోలు చూస్తున్నప్పుడు పరిమిత ప్రకటనలు వస్తాయని తెలిపింది. ఇది ప్రైమ్ సభ్యత్వం ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలనుకుంటే, వినియోగదారులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది.

Amazon Prime | నిర్మాత‌ల ఆందోళ‌న‌..

ప్రస్తుత ప్రైమ్ సభ్యత్వం(Prime Membership) ఉన్నవారు వీడియోలు యాడ్స్‌తోనే చూడాల్సి ఉంటుంది. యాడ్-ఫ్రీ అనుభూతిని కావాల‌ని అనుకునే వారు అయితే, అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ప్రణాళిక కోసం ₹1499 + ₹699 = ₹2198/Year ఖ‌ర్చు అవుతుంది. నెలవారీ ప్రణాళికకు: ₹299 + ₹129 = ₹428/Month అవుతుంది. ఇప్పటి వరకు యాడ్-ఫ్రీగా అందుబాటులో ఉన్న కంటెంట్ ఇకపై పూర్తిగా డబ్బు చెల్లిస్తేనే యాడ్‌లతో మినహాయింపు ఉంటుంది. అమెరికా(America)లో ఇప్పటికే యాడ్స్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అక్కడ గంటకు 2 నుంచి 6 నిమిషాల వరకు యాడ్స్‌(Adds)ని 4 నుంచి 6 విరామాలలో చూపిస్తున్నారు. భారతదేశంలోనూ ఈ విధానమే అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వీక్షణాల ఆధారంగా (watch-time based) రెవెన్యూ పొందే నిర్మాత‌లు, యాడ్ విధానం వల్ల తమ ఆదాయం తగ్గిపోతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. వీక్షకులు యాడ్స్ వల్ల అసహనం చెందుతూ వీడియోను మధ్యలో ఆపేసే ఛాన్స్ ఉంది. దీని వ‌ల‌న వీక్షణ సమయం త‌గ్గుతుంది. చిన్న నిర్మాతలకు(Producers) వచ్చే రెవెన్యూను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీరు ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలిస్తే.. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ సంవత్సరానికి రూ.1,499 చెల్లించాలి. జియో సినిమా ప్లాన్ సంవత్సరానికి రూ. 499. అయితే ఇందులో యాడ్స్ ప్రసారం అవుతాయి. ఇప్పుడున్న వాటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ మాత్రం అన్ని ప్లాన్‌లలోనూ యాడ్స్ లేకుండా సేవలు అందిస్తోంది.