అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రతిష్టాత్మకమైన “గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్”(Great Indian Festival Sale) ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఈ భారీ షాపింగ్ ఉత్సవం సెప్టెంబర్ 23 నుంచి మొదలవనుంది. ప్రైమ్ మెంబర్స్(Prime Members)కు ప్రత్యేకంగా సెప్టెంబర్ 22 నుంచే ప్రీ యాక్సెస్ అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్‌లో వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు(Mobile Phones), గృహోపకరణాలు, ఫ్యాషన్, ల్యాప్‌టాప్‌లు తదితర విభాగాల్లో భారీ తగ్గింపులు లభించనున్నాయి. అమెజాన్ ఇప్పటికే ఈ సేల్‌కు సంబంధించిన మైక్రోసైట్‌ను లైవ్‌లోకి తెచ్చింది. సెప్టెంబర్ 17న మొబైల్ ఫోన్ల ఆఫర్లు వెల్లడించనున్నారు.
అందుబాటులో ఉండే ముఖ్యమైన ఆఫర్లు ఇవే:
Samsung Galaxy S24 Ultra: సగం ధరకు లభించే అవకాశం.
iPhone 15: రూ.50,000 లోపల డీల్లో అందుబాటులో ఉండే అవకాశం.
OnePlus 13R, iQOO Neo 10R, Redmi A4, Realme Narzo 80 Lite 5G లాంటి పాపులర్ ఫోన్లు కూడా భారీ డిస్కౌంట్లతో లభించనున్నాయి.
ఫ్లాగ్‌షిప్ డివైస్‌లపై ప్రత్యేక డీల్స్: Samsung Galaxy S25 Ultra 5G, Xiaomi 15 Ultra, iQOO 13, OnePlus 13s మొదలైనవన్నీ చౌకగా లభించే అవకాశం.
ఇతర విభాగాల ఆఫర్లు:
- స్మార్ట్‌ఫోన్‌లు : 40% వరకు తగ్గింపు
- ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులు : 80% వరకు తగ్గింపు
- టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జీలు : 65% వరకు తగ్గింపు
- ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ గాడ్జెట్లు : ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో
బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్:
ఈ సేల్‌లో కేవలం డిస్కౌంట్లే కాదు, బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఎంపికలు, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. మొత్తంగా చెప్పాలంటే, అమెజాన్(Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఉత్తమ ప్రోడక్ట్స్‌ను సొంతం చేసుకునే అద్భుత అవకాశం. సేల్ ప్రారంభానికి ముందు మీరు కొనుగోలు జాబితాను సిద్ధం చేసుకోండి. మరోవైపు తన 10 నిమిషాల డెలివరీ సేవను అమెజాన్ ముంబైకి కూడా విస్తరించింది.
ఢిల్లీ, బెంగళూరులోని కస్టమర్ల నుండి వచ్చిన ఆదరణ చూసి ముంబైలో కూడా 10 నిమిషాల డెలివరీని విస్తరించాలని అనుకుంటుంది. కిరాణా, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు(Electronic Goods), పండుగ వస్తువులు ఇలాంటివి అన్ని కూడా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవి కేవలం 10 నిమిషాల్లో మాత్రమే డెలివరీ అవుతుంది. అయితే రానున్న రోజుల్లో దేశంలోని ముఖ్యమైన పట్టణాలకు ఈ సేవలు విస్తరించనున్నారనే టాక్ బయటకు రావడంతో ప్రత్యర్థులు హడలెత్తిపోతున్నారు.