అక్షరటుడే, వెబ్డెస్క్: Amazon Layoffs | అమెరికాకు చెందిన బహుళజాతి ఈ-కామర్స్ (e-commerce), టెక్ కంపెనీల(tech companies)లో ఒకటైన అమెజాన్ (Amazon).. తన ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చింది. ఈసారి పెద్ద సంఖ్యలో లేఆఫ్ ప్రకటించింది. గత సంవత్సరం అక్టోబర్లో కేవలం ఎస్ఎమ్ఎస్ ద్వారా 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించిన ఈ దిగ్గజ సంస్థ.. తాజాగా 16 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు (Layoffs) వెల్లడించింది.
Amazon Layoffs | జనరేటివ్ ఏఐను వినియోగించే యోచన
ఈమేరకు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గలెటీ ప్రకటించింది. కాగా, 2023 సంవత్సరం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడం ఇదే మొదటిసారి. ఆ ఏడాది సుమారు 27 వేల మందిని అమెజాన్ తొలగించడం గమనార్హం.
తొలగించిన ఉద్యోగుల స్థానంలో జనరేటివ్ ఏఐను ఉపయోగించే ఆలోచనలో ఉన్నట్లు బెత్ గలెటీ వెల్లడించారు. కొవిడ్ సమయంలో తీసుకున్న ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.