అక్షరటుడే, హైదరాబాద్: Amazon Layoffs | సాఫ్ట్వేర్ ఉద్యోగాలు (Software jobs) గాలిలో దీపంలా మారాయి. ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడుతాయో తెలియని దుస్థితి కొనసాగుతోంది..
తుమ్ముతే ఊడిపోయే ఉద్యోగాలుగా మారాయి ఐటీ కొలువుల పరిస్థితి. టెకీ కొలువు అందితే అందలం.. ఊడితే అథపాతాళమే. ఏ కంపెనీ ఎప్పుడు లేఆఫ్ ప్రకటిస్తుందో అంతు చిక్కడం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థక అనిశ్చితి కారణంగా ఇటీవల ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను అనూహ్యంగా తగ్గించుకుంటున్నాయి. తాజాగా అమెజాన్ అదే బాటలో పయనిస్తోంది.
Amazon Layoffs | రెండు మెసేజ్‌లో..
ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్(e-commerce), టెక్ కంపెనీల(tech companies)లో ఒకటైన అమెజాన్ భారీ స్థాయిలో ఉద్యోగుల (employees) ను తొలగించింది.
14 వేల మంది ఉద్యోగులకు ఏక కాలంలో కేవలం టెక్స్ట్ మెసేజ్ పంపించి, కొలువుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, టెకీ దిగ్గజం చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
అమెజాన్ ఉద్యోగుల్లో చాలా మంది ఫోన్లకు మంగళవారం (అక్టోబరు 28) తెల్లవారుజామున రెండు టెక్స్ట్ మెసేజ్‌లు వచ్చాయి.
సాధారణంగా టెకీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తే.. వెంటనే వారి ఎంట్రీ ఐడీని వెంటనే రద్దు చేస్తాయి. దీనివల్ల వారికి ఆఫీస్‌లోకి ప్రవేశం ఉండకుండా పోతుంది.
చాలా మంది తమ ఉద్యోగం పోయిందని తెలియక, ఆఫీస్ వద్ద లోపలికి వెళ్లలేక.. ఏమైందో తెలియక ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ఇలా మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది.
Amazon Layoffs | ఇదీ పరిస్థితి..
ప్రస్తుతం అమెజాన్లో ప్రపంచ వ్యాప్తంగా 1.54 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఉన్నారు. కేవలం కార్పొరేట్ విభాగంలోనే 3.5 లక్షల మంది పనిచేస్తున్నారు.
కాగా, కొవిడ్ covid మహమ్మారి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆన్‌లైన్ డిమాండ్ తగ్గడం, గ్లోబల్ ఎకానమీ మందగమనం, పెరుగుతున్న ఆపరేటింగ్ ఖర్చులు అమెజాన్ వ్యాపారంపై (Amazon Business) తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీంతో సంస్థ ఖర్చు తగ్గించుకునే వ్యూహాలు అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా పలు విభాగాల్లో ప్రాజెక్టులను నిలిపివేయడం, ఆటోమేషన్ టెక్నాలజీని పెంచడం, AI, రోబోటిక్స్ ఆధారిత వర్క్‌ఫ్లోలను ప్రవేశపెట్టడం వంటి మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇదే క్రమలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది.

