Homeబిజినెస్​Amazon Great Freedom Festival | మరో సేల్‌కు సిద్ధమైన అమెజాన్.. ఈసారి అందరికీ ‘ఫ్రీడమ్‌’

Amazon Great Freedom Festival | మరో సేల్‌కు సిద్ధమైన అమెజాన్.. ఈసారి అందరికీ ‘ఫ్రీడమ్‌’

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amazon Great Freedom Festival | ప్రముఖ ఇకామర్స్‌ సంస్థ అయిన అమెజాన్‌(Amazon).. భారత్‌లో మరో సేల్‌తో వినియోగదారుల ముందుకొస్తోంది. గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌(Great Freedom Festival) పేరుతో ఆగస్టు ఒకటో తేదీనుంచి ప్రత్యేక సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఇటీవల ప్రైమ్‌ మెంబర్ల కోసం ప్రత్యేకంగా ప్రైమ్‌ డే సేల్‌ నిర్వహించిన అమెజాన్‌.. ఈసారి అందరూ పాల్గొనే అవకాశాన్ని ఇస్తోంది. ప్రైమ్‌ మెంబర్లకు (Prime members) 12 గంటల ముందే ఈ సేల్‌లో యాక్సెస్‌ లభించనుంది. ఈ ప్రత్యేక సేల్‌ను ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారన్న దానిపై స్పష్టత లేదు.

Amazon Great Freedom Festival | కార్డు ఆఫర్లు, డీల్స్‌..

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్‌ (Smart phones), యాక్సెసెరీస్‌, ల్యాప్‌టాప్స్‌, గృహోపకరణాలు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్‌ అందించే అవకాశాలున్నాయి. కొన్ని వస్తువులపై లిమిటెడ్‌ టైమ్‌ ఆఫర్లతోపాటు ట్రెండింగ్‌, 8 పీఎం, బ్లాక్‌బస్టర్‌ వంటి పరిమిత కాల డీల్స్‌ కూడా ఉండనున్నాయి. అదనపు ఎక్స్ఛేంజ్‌, ఈఎంఐ, కార్డు ఆఫర్లూ(Card offers) ఉన్నాయి. కొనుగోళ్లపై తక్షణ డిస్కౌంట్‌లను అందించడానికి అమెజాన్‌ ఎస్‌బీఐ కార్డ్‌తో జతకట్టింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులో 10 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. అమెజాన్‌ పే ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్‌తో 3 నుంచి 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది. ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌కు సంబంధించి ఇప్పటికే అమెజాన్‌ తన వెబ్‌సైట్‌, యాప్‌లలో మైక్రోసైట్‌(Micro site)ను అందుబాటులో ఉంచింది. త్వరలో ఆఫర్ల వివరాలు రివీల్‌ కానున్నాయి.

Amazon Great Freedom Festival | ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఇలా..

గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు 12 గంటల ముందస్తు యాక్సెస్‌(Early access) లభించనుంది. ఇది కొన్ని డీల్‌లపై అదనపు ప్రయోజనంగా నిలుస్తుంది. ఇప్పటికే సబ్‌స్క్రైబ్‌ చేసుకోని వారు.. రూ. 299తో నెలవారీ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ తీసుకుంటే ఈ సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ పొందడానికి అవకాశం ఉంటుంది. మూడు నెలల ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ రూ. 599, వార్షిక మెంబర్‌షిప్‌ ఫీ రూ. 1,499గా ఉంది. కేవలం అమెజాన్‌ ప్రైమ్‌ షాపింగ్‌ ఎడిషన్‌ కూడా అందుబాటులో ఉంది. దీనికోసం రూ. 399 చెల్లిస్తే సరిపోతుంది.