అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flipkart | దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్(Flipkart) అమెజాన్‌పై పైచేయి సాధించింది. అమెజాన్ ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తేదీల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయకముందే ఫ్లిప్‌కార్ట్ మాత్రం బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను (Big Billion Days Sale) ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్‌లో పేర్కొన్న ప్రకారం ఈనెల 23నుంచి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్ సైతం ఇదే తేదీన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Great Indian Festival Sale) ప్రారంభించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈనెల 23న ప్రారంభమవుతుందని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. కంపెనీ ఆపిల్(Apple), శామ్‌సంగ్, మోటరోలా వంటి బ్రాండ్ ఫోన్‌లను తగ్గింపు ధరలకు అందించనున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్‌లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లతో సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై (Electronic products) కంపెనీ కొంతకాలంగా డీల్‌లను టీజ్ చేస్తున్నాయి. ఐఫోన్ 16, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో, వన్‌ప్లస్ బడ్స్ 3 డిస్కౌంట్ ధరకు లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడిరచింది. ఇంటెల్ పీసీలు, 55 అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లు వంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాలుంటాయి.
Flipkart | వారికి 24 గంటల ముందే..
కంపెనీ గతేడాది బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను సెప్టెంబర్ 27న ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు (Flipkart plus members) సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులో ఉంది. ముందస్తు యాక్సెస్ ప్రయోజనాల కారణంగా డీల్స్ పొందగలిగారు. ఈసారి కూడా ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు 24 గంటల ముందే సేల్ అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. సేల్ ఈవెంట్ సమయంలో కస్టమర్లు స్టీల్ డీల్స్, పరిమిత సమయ ఆఫర్‌లు, పండుగ రద్దీ సమయాలలో అదనపు డిస్కౌంట్స్ పొందే అవకాశాలుంటాయి. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఇతర ఉత్పత్తులపై డబుల్ డిస్కౌంట్‌లను కూడా అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
Flipkart | కార్డు ఆఫర్లు..
స్పెషల్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా బ్యాంక్‌ల క్రెడిట్ కార్డులతో (Credit cards) చేసే కొనుగోళ్లపై 10 శాతం వరకు తక్షణ రాయితీ లభించనుంది. ఆయా బ్యాంకుల డెబిట్ కార్డులపైనా 10 శాతం వరకు డిస్కౌంట్ వర్తించనుంది. నోకాస్ట్ ఈఎంఐ, యూపీఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్, పేలేటర్ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు సూపర్‌కాయిన్స్ ద్వారా ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసేవారికి 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.