Homeబిజినెస్​Amazon Diwali Sale | దీపావళి స్పెషల్ సేల్.. అమెజాన్‌లో 80 శాతం వరకు భారీ...

Amazon Diwali Sale | దీపావళి స్పెషల్ సేల్.. అమెజాన్‌లో 80 శాతం వరకు భారీ తగ్గింపులు.. ఐఫోన్​ 15, శాంసంగ్​ ఫోన్లు, గిఫ్ట్‌లపై సూపర్ ఆఫర్లు!

Amazon Diwali Sale | దీపావళి సంబరాలను ముందుగానే ఆహ్వానిస్తూ అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. “దీపావళి స్పెషల్ సేల్”గా ప్రకటించి తన బ్యానర్‌లో హైలైట్ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Diwali Sale | దీపావళి సందర్భంగా అమెజాన్ ఇండియా వినియోగదారుల కోసం భారీ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు దీపావళి స్పెషల్ (Diwali Special) సేల్‌గా రీబ్రాండ్ చేయబడింది. దీని భాగంగా కంపెనీ 80 శాతం వరకు తగ్గింపులు ప్రకటించింది.

Amazon Diwali Sale | ఈ సేల్‌లో ఏం లభిస్తోంది?

అమెజాన్ దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు (Smart Phones), టెలివిజన్లు, వాషింగ్ మెషీన్‌లు, ల్యాప్‌టాప్‌లు, బ్యూటీ ప్రొడక్ట్స్‌, గృహోపకరణాలు, దీపావళి గిఫ్ట్‌లు మొదలైనవి భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.

కంపెనీ వివరాల ప్రకారం..

  • ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్‌లపై 80 శాతం వరకు తగ్గింపు
  • బ్యూటీ & హోమ్ ఉత్పత్తులపై ప్రత్యేక ధరలు
  • గిఫ్ట్ ఐటమ్‌లపై అదనపు డీల్స్
  • బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి
  • అమెజాన్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు.
  • HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
  • Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం రివార్డ్ క్యాష్‌బ్యాక్ కూడా అందుతుంది.

స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు

ఈ దీపావళి సేల్‌లో అత్యధిక ఆకర్షణ స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లకే..

  • iPhone 15: రూ. 47,999కే అందుబాటులో ఉంది (మునుపటి ధర రూ.69,900).
  • 48MP ప్రైమరీ కెమెరా, టైప్-C పోర్ట్‌ సపోర్ట్‌తో వస్తోంది.
  • మొత్తం 31 శాతం తగ్గింపు లభిస్తోంది.
  • Samsung Galaxy M06 5G (4GB+128GB):
  • లాంచ్ ధర రూ. 9,499 కాగా ఇప్పుడు కేవలం రూ. 7,999కే లభిస్తుంది.
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్లు & క్యాష్‌బ్యాక్‌తో ధర మరింత తగ్గుతుంది.

Amazon Diwali Sale | చీపెస్ట్ గాడ్జెట్‌లు – సగం ధరకే!

సేల్‌లో చిన్న గాడ్జెట్‌లు కూడా విపరీతంగా డిమాండ్‌లో ఉన్నాయి.ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లు, మొబైల్ స్టాండ్లు, కీబోర్డ్‌లు, మౌస్‌లు, సెల్ఫీ స్టిక్స్ మొదలైనవి సగం ధరకు లభిస్తున్నాయి.

Amazon Diwali Sale | విమాన టిక్కెట్లపై తగ్గింపులు

ఈ సేల్‌లో భాగంగా విమాన బుకింగ్‌లపై 10 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అయితే, కొన్ని షరతులు వర్తిస్తాయని అమెజాన్ తెలిపింది.

Amazon Diwali Sale | మొత్తం మీద షాపర్లకు పండుగే!

దీపావళి సేల్ సందర్భంగా అమెజాన్ ఇండియా వినియోగదారులకు (Amazon India Customers) ఎలక్ట్రానిక్స్‌ నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్‌ వరకు అన్నింటినీ తక్కువ ధరలో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్‌బ్యాక్‌లు కలిపి ఈ దీపావళి ఆఫర్లు వినియోగదారులకే పండుగగా మారాయి.