ePaper
More
    HomeజాతీయంTrain Journey | ఇండియాలో బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఇవే.. థ్రిల్ మాములుగా ఉండ‌దు

    Train Journey | ఇండియాలో బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఇవే.. థ్రిల్ మాములుగా ఉండ‌దు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Train Journey | మన దేశంలో ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు చాలా ఉన్నాయి. ట్రైన్ జ‌ర్నీలో చూసే ప్రాంతాలు కూడా ఎక్కువే. అయితే ఆ థ్రిల్, ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్లకే తెలుస్తుంది. మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే, ఇండియా(India)లో అద్భుతమైన ట్రైన్ జర్నీ Train Journey ఈ రూట్స్‌లో చేయాల్సిందే. విశాఖపట్నం టు అరకులోయఅరకు లోయ అందాలను చూడాలంటే, రైలులోనే వెళ్లాలి. ఎటు చూసినా పచ్చని చెట్లతో నిండిన పెద్ద కొండలు, జలపాతాలు కనిపిస్తాయి. మెట్టుపాళయం నుంచి ఊటీ (46 కి.మీ) వరకు జర్నీ ఉంటుంది.చెన్నై టు రామేశ్వరంపంబన్(Chennai to Rameswaram) సముద్ర వంతెన మీదుగా సాగే ఈ రైలు ప్రయాణంలో.. గల్ఫ్ ఆఫ్ మన్నార్(Gulf of Mannar) అందాలను చూడవచ్చు.

    Train Journey | బ్యూటీ ఫుల్ జర్నీ..

    హొన్నావర్ టు మంగళూరు.. ఈ జ‌ర్నీలో కర్ణాటక తీర ప్రాంతాలు, పచ్చని అటవీ అందాలు, జంతువులను చూస్తూ ఈ జర్నీ ఆస్వాదించవచ్చు. హొన్నావర్ నుంచి మంగళూరు వరకు 180 కి.మీ రైల్వే ప్రయాణం ఉంటుంది. ముంబై టు గోవా(Mumbai to Goa) వయా కొంకణ్ జ‌ర్నీలో కోస్టల్ సీనరీస్ కవర్ చేస్తూ గోవా వెళ్లవచ్చు. విస్టా డోమ్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. జర్నీ 465 కి.మీ ఉంటుంది. జోధ్‌పూర్ టు జైసల్మేర్ రూట్‌లో ఎడారి అందాలను చూడవ‌చ్చు. మధ్య మధ్యలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే గ్రామాలు కనిపిస్తాయి. జర్నీ Journey మొత్తం 290 కి.మీ ఉంటుంది.

    న్యూ ఢిల్లీ టు అమృత్‌సర్(New Delhi to Amritsar) జ‌ర్నీలో పంజాబీ గ్రామాలు, అక్కడ సంస్కృతిని ఈ జర్నీలో చూడవచ్చు. ఈ రైలు ప్రయాణంలో మీరు గ్రామీణ భారతాన్ని చూసే విజన్ మారుతుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 475 కి.మీ ఉంటుంది. గోవా టు హుబ్లీ జ‌ర్నీలో దూద్‌సాగర్ జలపాతం, మొల్లెం నేషనల్ పార్క్ విజిటింగ్ ఈ రూట్‌లో హైలెట్స్. అయితే ఉదయం జర్నీ ప్రారంభిస్తే, సీనరీస్ చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. మడ్గావ్ నుంచి ప్రయాణం ప్రారంభమై 175 కి.మీ దూరంలో ఉన్న హుబ్లీ చేరుకోవచ్చు. గౌహతి టు దిబ్రూఘర్ రూట్‌లో అస్సాం అందాలు, కొండ ప్రాంతాలు, తేయాకు తోటలను కవర్ చేస్తూ సాగే ఈ రైలు ప్రయాణం, మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. టూరిస్టులు Tourists అస్సామీ కల్చర్‌ను ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు. ఈ రెండు నగరాల మధ్య దూరం 500 కి.మీ ఉంటుంది. జ‌మ్మూ టు బనిహాల్ జ‌ర్నీలో మంచుతో కప్పబడిన పర్వతాలు, కాశ్మీర్(Kashmir) లోయ అందాలను ట్రైన్ జర్నీలో ఆస్వాదించే రూట్ ఇది. ఇక్కడి ప్రకృతిని ఆస్వాదించాలంటే, ఉదయం బయలుదేరడం మంచిది.

    More like this

    Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపైనే అనుమానం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cross Voting | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధకృష్ణన్ ఘన...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....