HomeUncategorizedAmaravati | అమరావతి ముఖ ద్వారం చూశారా.. ముస్తాబ‌వుతున్న‌ మూలపాడు..!

Amaravati | అమరావతి ముఖ ద్వారం చూశారా.. ముస్తాబ‌వుతున్న‌ మూలపాడు..!

- Advertisement -

అక్షరటుడే, అమరావతి: Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన‌ట్టుగా క‌నిపిస్తోంది. విజయవాడ – హైదరాబాద్ మార్గంలో మూలపాడు(Moolapadu) నుంచి గ్రాండ్ ఎంట్రన్స్‌వే ఏర్పాటు చేయనున్నారట‌. ఈ మార్గం కృష్ణానది మీదుగా ఐకానిక్ బ్రిడ్జి ద్వారా రాయపూడి వరకు సాగుతుంది.

అమరావతి అభివృద్ధి సంస్థ సరికొత్త అలైన్‌మెంట్‌పై కసరత్తులు చేస్తోంది. ఇది కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో (Ibrahimpatnam Mandal) ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్రామం రాజధాని ప్రధాన ప్రవేశ ద్వారంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.

Amaravati : గ్రాండ్ ఎంట్రెన్స్ వే ఏర్పాటు..

ఇప్పటికే అమరావతి అభివృద్ధి కోసం 34,000 ఎకరాలకు పైగా భూములు రైతుల నుంచి సేకరించారు. అయితే రాజధానిలోకి వెళ్లే ప్రధాన మార్గాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే విషయంపై కొన్నాళ్లుగా చ‌ర్చ‌లు న‌డుస్తూనే ఉన్నాయి.

ఈ క్ర‌మంలో మూలపాడు ప్రాంతం అధికారులు, ప్రజాప్రతినిధులకు అనుకూలంగా కనిపించిందట. ముఖ్యంగా, హైద‌రాబాద్ (Hyderabad) – విజ‌య‌వాడ (Vijayawada) జాతీయ రహదారికి దగ్గరగా ఉండడం వల్ల, ఈ మార్గం చాలా సులభతరం అవుతుంది అని వారు భావిస్తున్నార‌ట‌. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబుకు, CRDA అధికారులకు ఈ ప్రతిపాదనపై వివరాలు సమర్పించిన‌ట్టు స‌మాచచారం.

మూల‌పాడు వ‌ద్ద ముఖ ద్వారం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారికి సులభమైన ప్రవేశద్వారం అవుతుంది. అలాగే, గుంటూరు (Guntur) లేదా ఉండవల్లి (Undavalli) నుంచి వచ్చే వారికి మాత్రం ప్రస్తుతం కరకట్ట మీదుగా ఉన్న దారిని వాడాల్సి వస్తుంది. దానిని మరింత అభివృద్ధి చేసి ఆరు లేన్ల రహదారిగా మార్చే యోచనలో ఉన్నారు.

ఇక మూలపాడులో ఏర్పాటు చేయనున్న ఐకానిక్ బ్రిడ్జి ఒక విశిష్ట నిర్మాణంగా ఉంటుంద‌ని అంటున్నారు. ప్రస్తుతం భూసార పరీక్షలు జరుగుతున్నాయని సమాచారం. ఇది పూర్తయిన వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అమరావతికి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ ద్వారంపైనే ప్రవేశించాల్సి రావడం వల్ల, ఈ గ్రామం భవిష్యత్‌లో ట్రాన్స్‌పోర్ట్, కమర్షియల్ కార్యకలాపాలకు కేంద్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.

Must Read
Related News