అక్షరటుడే, అమరావతి: Amaravati Property Festival | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిబింబిస్తూ.. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) ‘అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ – 2025’ ను నిర్వహించబోతోంది.
ఈ ఫెస్టివల్ సెప్టెంబరు 19 నుంచి 21 తేదీల వరకు విజయవాడలోని లబ్బీపేట ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.
ఫెస్టివల్ లోగోను ఆవిష్కరించిన నారెడ్కో రాష్ట్ర అధ్యక్షుడు గద్దె చక్రధర్.. ఈ కార్యక్రమం రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.
ప్రాపర్టీ ఫెస్టివల్ హైలైట్స్ విషయానికి వస్తే.. సెప్టెంబరు 19–21, 2025 జరగనుంది. ఏ కన్వెన్షన్ సెంటర్, లబ్బీపేట, విజయవాడ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Amaravati Property Festival | అతి త్వరలోనే..
అమరావతి Amaravathi ప్రాపర్టీ ఫెస్టివల్లో ప్రత్యేక రాయితీలను అందించనున్నట్లు నారెడ్కో సెంట్రల్ జోన్ ఛైర్మన్ మండవ సందీప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఇప్పుడే పెట్టుబడులకు అనుకూలం అని చెప్పుకొచ్చారు.
విజయవాడలోని లబ్బీపేట ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ Narayana ప్రారంభించనున్నట్లు రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 60కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.
అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఉచిత ప్రవేశంతో పాటు తక్షణ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నట్లు నారెడ్కో రాష్ట్ర కోశాధికారి చావా రమేష్ ఓ ప్రకటనలో తెలియజేశారు.
బ్రోచర్ విడుదల కార్యక్రమంలో నారెడ్కో సెంట్రల్ జోన్ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి హరిప్రసాద రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.వీ రమణ, సీఆర్‌డీఏ ప్రతినిధులు సీతారామయ్య, వాసిరెడ్డి వంశీ, పీవీ కృష్ణ, కోడే జగన్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతిని విజయవాడ- హైదరాబాద్ Hyderabad నేషనల్ హైవేతో అనుసంధానించేందుకు కృష్ణా నదిపై ఓ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి (Iconic Cable Bridge) నిర్మించనున్నారు.
ఇందుకోసం నాలుగు డిజైన్లు రెడీ చేసిన సీఆర్‌డీఏ.. ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ప్రజలకు అవకాశం ఇచ్చింది. ఈ ఓటింగ్‌లో ఎక్కువ మంది సూచించిన డిజైన్‌తో అమరావతి ఐకానిక్ బ్రిడ్జి రూపొందించనున్నారు.
ఈ ఫెస్టివల్‌ను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించనున్నారు. కార్యక్రమాన్ని నారెడ్కో సెంట్రల్ జోన్ ఛైర్మన్ మండవ సందీప్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ పరుచూరి, కోశాధికారి చావా రమేష్ తదితరులు సమన్వయం చేస్తారు.