PM Modi | అమరావతి నగరమే కాదు.. ఒక శక్తి : మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన రాష్ట్రంగా మార్చే శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. అమరావతి స్వర్ణాంధ్ర ప్రదేశ్​ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమరావతి పున:ప్రారంభోత్సవ పనుల్లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ‘మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ తెలుగు ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: PM Modi | అమరావతి(Amaravati) నగరం మాత్రమే కాదని.. ఒక శక్తి అని.. ఆంధ్రప్రదేశ్​ను అధునాతన రాష్ట్రంగా మార్చే శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. అమరావతి స్వర్ణాంధ్ర ప్రదేశ్​ నిర్మాణానికి ఎంతో దోహదం చేస్తుందన్నారు. అమరావతి పున:ప్రారంభోత్సవ పనుల్లో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ‘మీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉంది’ అంటూ తెలుగు ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి స్వప్నం(Amaravati Dream) సాకారం అవుతున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​(Deputy CM Pawan Kalyan), ఆంధ్రప్రదేశ్​ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఎన్టీఆర్​ వికసిత్​ ఆంధ్రప్రదేశ్​ కోసం కలలుగన్నారని తెలిపారు. వికసిత్​ భారత్​లో భాగంగా ఆంధ్రప్రదేశ్​ అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇది మనమే చేయాలన్నారు.

PM Modi | టెక్నాలజీ చంద్రబాబుని చూసి నేర్చుకున్నా..

నేను ఈ సభలో మీకో రహస్యం చెబుతానని మోదీ అన్నారు. గుజరాత్​ ముఖ్యమంత్రి(Gujarat Chief Minister)గా ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్​లో ఐటీ(IT) ఏవిధంగా అభివృద్ధి చేశారో తెలుసుకున్నానని తెలిపారు. నేను ఆ సమయంలో ఆయన నుంచి నేర్చుకున్నానని పేర్కొన్నారు.

PM Modi | రికార్డు స్థాయి స్పీడ్​లో పనుల పూర్తికి సహకారం

రికార్డు స్థాయి స్పీడ్​లో పనులను పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని ప్రధాని మోదీ(Prime Minister Modi) తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాలను కల్పించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. హైవే(High Way)ల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అమృత్​ భారత్(Amruth Bharath)​ కింద అనేక రైల్వేస్టేషన్లను ఆధునీకరించామని చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...