అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heroine Amala Paul | హీరోయిన్ అమలాపాల్ (Amala paul) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె ఏం చేసిన అది సంచలనమే. పెళ్లి , విడాకులు, రెండో పెళ్లి, ప్రెగ్నెన్సీ అన్ని కూడా సంచలనమే చెప్పాలి.
అమలాపాల్‌కు తెలుగు, తమిళ భాషల్లో (amala paul telugu and tamil) మంచి క్రేజ్ ఉంది. తమిళ హీరోయిన్గా (tamil heroine) అడుగుపెట్టినప్పటికి, తెలుగులో అశేష ఆదరణ పొందింది. సినిమాలతోనే కాక వ్యక్తిగత జీవితంతో కూడా అమలాపాల్ వార్తల్లో నిలిచారు. అమలాపాల్ ముందుగా దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది (amalapaul love mariage with director vijay). ఆ తర్వాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
అనంతరం ఈ అమ్మడు తిరిగి సినిమాలలో నటించింది. గతంలో కన్నా హాట్‌గా కనిపించి మంత్ర ముగ్ధులను చేసింది. అయితే జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది (amalapaul introduced jagat desai her lover). అనంతరం పెళ్లి (Marriage) చేసుకొని షాకిచ్చింది. ఆ తర్వాత గర్భవతి కావడం, వెంటనే పండంటి బిడ్డకి జన్మనివ్వడం వెంటవెంటనే జరిగిపోయాయి. తాజాగా అమలాపాల్ (heroine amalapaul) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. తన భర్త జగత్ దేశాయ్‌తో డేటింగ్ చేస్తున్న సమయంలో తాను ఒక నటినని అతనికి తెలియదని ఆమె చెప్పుకొచ్చింది.
జగత్ దేశాయ్ (Jagat Desai) మాట్లాడుతూ.. ముందు మేము గోవాలో (Goa) కలిశాం. జగత్ గుజరాతీ అయినప్పటికీ అక్కడే ఉంటున్నాడు. నేను కేవలం కేరళకు చెందిన అమ్మాయినని మాత్రమే అతనికి చెప్పాను. అతను ఎక్కువగా దక్షిణాది సినిమాలు (south indian films) చూడడు కాబట్టి నటిననే విషయం అతనికి తెలియదు.. కేవలం నా వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాను (instagram account) మాత్రమే అతనికి చూపించాను అని చెప్పుకొచ్చారు. ‘నేను గర్భవతిగా ఉన్న సమయంలో నేను హీరోయిన్ అని తెలియడంతో ఒక్కొక్కటిగా నా సినిమాలు చూడడం ప్రారంభించాడు. అతనికి అవార్డుల కార్యక్రమాలు (award functions) చూడటమంటే చాలా ఇష్టం. నేను అవార్డులు తీసుకోవడం, రెడ్ కార్పెట్‌పై నడవడం, స్టేజ్‌పై మాట్లాడటం చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు’ అని కూడా అమలాపాల్ (amalapaul) పేర్కొంది.