అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ram charan | చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన చెర్రీ(globel star ram charan) ఇప్పుడు పెద్ది సినిమాతో(peddi movie) తన క్రేజ్ మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాడు. రామ్ చరణ్ తన క్రేజ్‌ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నాడు. ఈ రోజు రామ్ చరణ్, రైమ్స్ వ్యాక్స్ స్టాచ్యూ ఆవిష్కరణ ఘనంగా జరగనుంది.
ఈ కార్యక్రమం కోసం మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ (Ram charan), సురేఖ, ఉపాసన నాలుగు రోజుల ముందే లండన్ (london) వెళ్లారు. తాజాగా చరణ్, చిరంజీవి, సురేఖ, ఉపాసన అంతా మేడం టుస్సాడ్స్‌కు చేరుకున్నారు. లండన్‌లోని మెగా అభిమానులు (mega fans) రాంచరణ్‌కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హంగామా చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Ram charan | ఫుల్ ఫాలోయింగ్..
రాంచరణ్ స్టైలిష్ లుక్ (ram charan stylish look) ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మేడం టుస్సాడ్స్ స్టాచ్యూ లాంచ్ కావడం అరుదైన గౌరవమని చెప్పాలి. గతేడాది మేడం టుస్సాడ్స్ టీం అయితే రామ్ చరణ్‌తో పాటుగా రైమ్ కొలతల్ని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ మైనపు విగ్రహం Wax statue ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ప్రభాస్ (prabhas), మహేష్ బాబు (mahesh babu), అల్లు అర్జున్ (allu arjun) వంటి హీరోల మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సింగపూర్ (singapoor), లండన్ (london), దుబాయ్ (dubai) వంటి ప్రదేశాల్లో వీరి మైనపు విగ్రహాల్ని ఆవిష్కరించారు. ఇక ఇప్పుడు లండన్‌లో రామ్ చరణ్ (ram charan) మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతోన్నారు. చిరంజీవి ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్ (Jagadeka Veerudu Atiloka Sundari re-release) ప్రమోషన్స్ పూర్తి చేసుకుని లండన్‌కి వెళ్లారు. ఆయనని చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు.
ఈ నెల 11న ఫేమస్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ‘RRR’ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ కీరవాణితో RRR సాంగ్స్ ఆర్కెస్ట్రా నిర్వహించిన.. ఆ తర్వాత రామ్ చరణ్ (ram charan), రాజమౌళి (rajamouli), ఎన్టీఆర్‌లతో (NTR) క్వశ్చన్స్, ఆన్సర్స్ కార్యక్రమం కూడా ఉండనుందని సమాచారం. దీంతో ఆ ఈవెంట్ అయ్యే వరకూ చిరంజీవి, రామ్ చరణ్ దంపతులు అక్కడే ఉండనున్నారు.